ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లండి... ఈ 5 అద్భుతమైన కోటలు కూడా చూసేయండి!

By Arun Kumar P  |  First Published Jan 9, 2025, 11:27 PM IST

ప్రయాగరాజ్‌లో ప్రసిద్ధ ప్రదేశాలు:  మమా కుంభమేళా 2025 కి వెళ్లేవారు ఈ చారిత్రాత్మక కోటలను కూడా సందర్శించవచ్చు.  


ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా 2025 సందడిగా మొదలైంది. ఈసారి కుంభమేళా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మీరు కూడా కుంభమేళాకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ప్రయాగరాజ్‌లోని ప్రసిద్ధ కోటలను తప్పకుండా సందర్శించండి. ఈ కోటలు ఎంత అందంగా ఉన్నాయో, అంతే చారిత్రాత్మకమైనవి కూడా. కుంభమేళా ట్రిప్‌లో తప్పకుండా సందర్శించాల్సిన 5 కోటల గురించి తెలుసుకొండి.

1) అలహాబాద్ కోట

అలహాబాద్ కోటను 1583లో అక్బర్ చక్రవర్తి నిర్మించారు. ఈ కోట త్రివేణి సంగమం దగ్గర ఉంది. అంటే మహా కుంభమేళా నుండి ఇది ఎక్కువ దూరంలో లేదు. మీరు మేళాతో పాటు వేరే ఏదైనా చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లవచ్చు. ఈ కోట దాని గొప్ప నిర్మాణ శైలి, అశోక స్తంభం, సరస్వతీ కూపం, పాతాళపురి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 24 గంటలూ పోలీసుల భద్రత ఉంటుంది, అయితే కోటలోని కొన్ని భాగాలను పర్యాటకుల సందరశనార్థం తెరిచారు.

 2) కౌశాంబి కోట

Latest Videos

ప్రయాగరాజ్ సమీపంలోని కౌశాంబి జిల్లాలో ఉన్న ఈ కోట మౌర్య, గుప్త కాలాలతో ముడిపడి ఉంది. ఇక్కడ కోట శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ ఈ ప్రదేశం ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోట దాని ప్రాచీన శిథిలాలు, కోటలు, బౌద్ధ స్థూపాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ తిరగడానికి మీకు సమయం ఉండాలి.

3) జున్సీ కోట

ప్రయాగరాజ్ నుండి గంగా నదికి అవతల జున్సీలో ఉన్న ఈ కోట ఒకప్పుడు నగరంగా ఉండేదని నమ్ముతారు, కానీ కాలక్రమేణా ఈ కోటను చాలా మంది రాజులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇక్కడ చారిత్రాత్మక నిర్మాణాల అవశేషాలను చూడవచ్చు.

4) వింధ్యాచల్ కోట

ప్రయాగరాజ్‌కి వస్తున్నప్పుడు, చుట్టుపక్కల జిల్లాలను కూడా చూసేయండి. ప్రయాగరాజ్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వింధ్యాచల్ కోట దాని మతపరమైన ప్రముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక జలపాతాలను కూడా ఆస్వాదించవచ్చు. ప్రయాగరాజ్ నుండి ఇక్కడికి గరిష్టంగా ఒకటిన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది.

5) చునార్ కోట

ప్రయాగరాజ్ నుండి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చునార్ కోట. ఇది చాలా అందంగా ఉంటుంది. దీనిని ఉజ్జయిని రాజు విక్రమాదిత్య నిర్మించారు. ఈ కోట గంగా నది ఒడ్డున ఉంది, ఇక్కడ నుండి నది అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. కోట చరిత్ర షేర్ షా సూరి, బ్రిటిష్ కాలాలతో ముడిపడి ఉంది. ఇక్కడ ఎల్లప్పుడూ పర్యాటకుల రద్దీ ఉంటుంది. మీరు ప్రయాగరాజ్‌కి వచ్చి, మీకు సమయం ఉంటే, ఈ కోటను సందర్శించవచ్చు.

 

 

click me!