మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ... యోగి ఆదిత్యనాథ్ ను రంగంలోకి దించిన బిజెపి కూటమి

By Arun Kumar P  |  First Published Nov 6, 2024, 10:47 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి కూటమి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను రంగంలోకి దించింది. ఆయన మహా అఘాడీపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు... ప్రత్యర్థి కూటమిని 'మహా అనాడీ' అని అభివర్ణించారు.  


మహారాష్ట్ర: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ (బుధవారం) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి కూటమి మహా అఘాడీపై విరుచుకుపడుతూ... దాన్ని 'మహా అనాడీ' కూటమిగా అభివర్ణించారు. అమరావతిలో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ... నవనీత్ రాణా ఇక్కడ హనుమాన్ చాలీసా కోసం కూడా పోరాడాల్సి వచ్చిందని యోగీ అన్నారు. త్రేతాయుగంలో బజరంగ్ బలి ఉన్నప్పుడు ఇస్లాం అనేది లేనే లేదని వ్యాఖ్యానించారు.

రామనవమి ఊరేగింపు, హనుమాన్ చాలీసా పారాయణం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బజరంగ్ బలిని ఇష్టపడని వారు వారికి నచ్చిన చోటికి వెళ్లిపోవచ్చని, భారతదేశంలో రాముడు, బజరంగ్ బలిని నమ్మని భారతీయుడు ఎవరున్నారని ప్రశ్నించారు.

Latest Videos

undefined

మహావికాస్ అఘాడీకి అధికారం అంటే అవినీతి, దోపిడీ

రెండు పెద్ద కూటములు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని, ఒకవైపు ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహా యుతి, మరోవైపు మహా అనాడీ కూటమి అయిన మహా అఘాడీ ఉందని సీఎం యోగీ అన్నారు. దేశం, మతం, జాతీయత, సమాజం, జాతి విలువలు, ఆదర్శాల గురించి పట్టించుకోని వారు అనాడులని, మహా అనాడీ కూటమి అదే చేస్తోందని ఆరోపించారు.

మహావికాస్ అఘాడీకి అధికారం అంటే అవినీతి, దోపిడీ అని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, నక్సలిజాన్ని ప్రోత్సహించడమే వారి లక్ష్యమని విమర్శించారు. మహా యుతి కూటమి మోదీ నాయకత్వంలో దేశం గొప్పదనాన్ని కోరుకుంటోందని, మహా అఘాడీ మాత్రం తమ స్వార్థం కోరుకుంటోందని అన్నారు.

అధికారం వస్తుంది, పోతుంది, కానీ మన భారతదేశం ఉండాలి, మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదగాలని సీఎం యోగీ అన్నారు. మహా అనాడీ కూటమి భారతదేశం, భారతీయత గౌరవం, ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని... కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు రాముడు, కృష్ణుడు లేరని అనేవారని... ఇప్పుడు వారికీ రాముడు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. 500 ఏళ్ల తర్వాత రామాలయంలో దీపావళి వేడుకలు జరిగాయని గుర్తిచేశారు.

ఆగ్రాలో ముఘల్ కాదు, శివాజీ మ్యూజియం

శివాజీ పోరాటం భారతదేశ ఆత్మగౌరవ పోరాటమని... ఔరంగజేబును సవాలు చేయడానికి శివాజీ ఆగ్రా వెళ్లారని గుర్తుచేసారు. కారీ గత పాలకులు అక్కడ ఔరంగజేబు మ్యూజియం నిర్మించారు... తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆగ్రా వెళ్లి ఆ మ్యూజియం పేరు శివాజీ మ్యూజియంగా మార్చానని సీఎం యోగీ చెప్పారు.

 కాంగ్రెస్ దేశం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, పాకిస్తాన్ ఉగ్రదాడులు చేసినా, చైనా సరిహద్దులు దాటినా కాంగ్రెస్ సంబంధాలు చెడిపోతాయని భయపడిందన్నారు. కానీ మోదీ నాయకత్వంలో కొత్త భారతం ఉందని, సరిహద్దు దాటితే ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోయిందని సీఎం యోగీ అన్నారు.

370 రద్దుతో మౌల్వీ కూడా రామ్ రామ్ అంటున్నారు

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో జమ్మూ విమానాశ్రయంలో ఒక మౌల్వీ తనకు రామ్ రామ్ చెప్పారని, 370 రద్దు ప్రభావమే ఇదని సీఎం యోగీ అన్నారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు నిషాదరాజు తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చినా, రాముడు అంగీకరించలేదని... సుగ్రీవుడు, విభీషణుడికి అధికారం ఇచ్చినా రాజభోగాలు అనుభవించలేదని... అదే రాముడి త్యాగం, ఆదర్శమని సీఎం యోగీ అన్నారు.

click me!