ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 కోసం యోగి ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమవుతోంది. ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సంసిద్దం చేసారు.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా 2025 ను విజయవంతం చేయడానికి యోగి సంసిద్దమయ్యింది. ఇంతటి భారీ సామూహిక కార్యక్రమంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినయినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంలో ఏ చిన్న లోపమూ లేకుండా చూసుకోవడానికి, ఆరోగ్య కార్యకర్తలతో పాటు NDRF, SDRF బృందాలు కలిసి పనిచేస్తున్నాయి.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా కంటే ముందుగానే రసాయన, జీవ, రేడియేషన్, అణు సమస్యలను ఎదుర్కోవడానికి బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి సిబ్బందికి సరైన శిక్షణ ఇస్తున్నారు. అంతేకాక యోగి ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్తులకు మెరుగైన వైద్యం కోసం ప్రయాగరాజ్‌లోని ఆసుపత్రులను ఆరోగ్య శాఖ అధికారులు అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
ప్రయాగరాజ్ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ వి.కె. మిశ్రా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహా కుంభమేళాకు తగినట్లు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను పటిష్టం చేస్తోందని అన్నారు. దీనిలో భాగంగా ఉద్యోగులకు కుంభమేళాలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి శిక్షణ ఇస్తున్నారు. మహా కుంభమేళాకు దేశవిదేశాల నుండి వచ్చే భక్తుల వైద్య పరీక్షల కోసం టి.బి. సప్రూ, స్వరూప్‌రాణి ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు.
ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. సనాతన ధర్మంలో అతిపెద్ద కార్యక్రమం సందర్భంగా ప్రతి భక్తుడిని రసాయన, జీవ, రేడియేషన్, అణు సంబంధిత ప్రమాదాల నుండి రక్షించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మహా కుంభమేళా సమయంలో దేశవిదేశాల నుండి వచ్చే భక్తులను చూసుకోవడానికి 291 మంది ఎంబిబిఎస్, స్పెషలిస్ట్ వైద్యులను నియమిస్తున్నారు. అంతేకాక 90 మంది ఆయుర్వేద, యునాని నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో సహాయం చేస్తారు. 182 మంది వైద్య సిబ్బంది, నర్సులు వైద్యులతో కలిసి అవసరమైన వారి ఆరోగ్యాన్ని చూసుకుంటారు. ఈ ప్రక్రియలో ఎక్కువగా అనుభవజ్ఞులైన వైద్యులనే ఉపయోగించుకుంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.