మద్యం, మాంసంపై నిషేధం.. యూపీ సీఎం నిర్ణయం..!

By telugu news teamFirst Published Aug 31, 2021, 9:37 AM IST
Highlights

పకడ్బందీగా నిషేధం అమలుకు, మద్యం, మాంసం వ్యాపారులు ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మథుర లో మద్యం, మాంసం పై పూర్తి నిషేధం ప్రకటించారు. పకడ్బందీగా నిషేధం అమలుకు, మద్యం, మాంసం వ్యాపారులు ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన కృష్ణోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఇప్పటి వరకు మద్యం, మాంసం వ్యాపారం చేసినవారు మథురకు పూర్వవైభవాన్ని తెచ్చేలా పాలు విక్రయించాలని సూచించారు.

ఈ మేరకు ఆయన అధికారులకు కూడా పలు సూచనలు చేశారు.  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మద్యం మరియు మాంసం వ్యాపారంలో నిమగ్నమైన వారు పెద్ద మొత్తంలో జంతువుల పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన మధుర వైభవాన్ని పునరుద్ధరించడానికి పాలు విక్రయించవచ్చని ఆయన సూచించారు. అంతేకాకుండా.. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని ఈ సందర్భంగా సీఎం  యోగి.. శ్రీకృష్ణుడిని పూజించారు. 
 

click me!