యోగా చేస్తే బరువు తగ్గరా..? డాక్టర్ కామెంట్స్ కి నెటిజన్లు సీరియస్..!

Published : Jun 26, 2023, 11:05 AM IST
   యోగా చేస్తే బరువు తగ్గరా..? డాక్టర్ కామెంట్స్ కి నెటిజన్లు సీరియస్..!

సారాంశం

ఓ వ్యక్తి ట్విట్టర్ లో ప్రజల్లో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటిలో నిజం ఏంటి అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే,  ఒక వ్యాఖ్యం మాత్రం నెటిజన్లకు నచ్చలేదు.


యోగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కేవలం ఆరోగ్యానికి మేలు  చేయడమే కాకుండా, బరువు తగ్గించడంలోనూ యోగా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే, ఓ డాక్టర్ దీనికి భిన్నంగా మాట్లాడారు. యోగా చేయడం వల్ల బరువు కొంచెం కూడా తగ్గించుకోలేరు అంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ అభిప్రాయాన్ని షేర్ చేయగా, దానిపై విమర్శలు ఎక్కువయ్యాయి.

ఓ వ్యక్తి ట్విట్టర్ లో ప్రజల్లో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటిలో నిజం ఏంటి అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే,  ఒక వ్యాఖ్యం మాత్రం నెటిజన్లకు నచ్చలేదు.

ట్విట్టర్‌లో లివర్ డాక్ పేరుతో డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్, ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. తన వైరల్ ట్వీట్‌లో, అతను నిర్దిష్ట ఆహార పదార్థాలు, వ్యాయామం, యోగా మొదలైన వాటికి సంబంధించిన కొన్ని సాధారణ అపోహలను తొలగించాడు.

 

అతను తన పోస్ట్‌ను 20 పాయింట్లను పోస్టు చేశాడు.  దీనిలో ప్రజలు నమ్మే కొన్ని అపోహలను ఆయన తొలగించారు. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకోవడం నుండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం బయోటిన్ పిల్ పాపింగ్ వరకు, అతను తన పోస్ట్‌లో ఈ ప్రసిద్ధ వాదనలన్నింటినీ ఖండించాడు. అయితే, అందులో ఆయన యోగా బరువు తగ్గడానికి ఉపయోగపడుదు అని కామెంట్ చేశాడు.

అయితే, ఆ పాయింట్ మాత్రం ఎవరికీ నచ్చలేదు. యోగా చాలా మంది బరువు తగ్గడానికి ఉపయోగపడిందని, అందులో నిజం లేదు అంటారేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా యోగా చేసినా బరువు తగ్గలేదు అంటే, వారు యోగాని కూడా డామినేట్ చేసేలా ఫుడ్ తీసుకొని ఉంటారని  కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరిగా ఆహారం తీసుకుంటే, యోగా చేసినా సులభంగా బరువు తగ్గవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. 
 

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu