ఒంటరిగా పోటీ చేసుకోవచ్చు.. మాకు అభ్యంతరం లేదు: మహా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్

By Siva KodatiFirst Published Jun 20, 2021, 3:30 PM IST
Highlights

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని అనుకుళ్లే వాళ్లు అలాగే చేయవచ్చని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . 

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని అనుకుళ్లే వాళ్లు అలాగే చేయవచ్చని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . మహా వికాస్ అఘాడి కూటమి భాగస్వామిగా కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ  నేపథ్యంలో సంజయ్ రౌత్ ఆయనకు కౌంటరిచ్చారు. రాజకీయ పోరాటాలను తమ పార్టీ సొంతంగా చేస్తుందని, ఒంటరిగా పోటీ చేయాలనుకునే పార్టీలు ఆ విధంగా చేసుకోవచ్చని రౌత్ సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో కూటములు ఏర్పాటవుతుంటాయని, రాజకీయ పోరాటాలు మాత్రం స్వతంత్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పార్టీ 55వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం జరిగిందనీ, ఒంటిరిగా పోటీ చేస్తామంటూ మాట్లాడేవాళ్లు అలా చేసుకోవచ్చని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా స్పష్టం చేశారని సంజయ్ వెల్లడించారు. 

Also Read:మొన్న ఉద్ధవ్, నేడు సంజయ్ రౌత్.. మోడీయే టాప్ లీడరంటూ కితాబు: బీజేపీకి సేన దగ్గరవుతోందా..?

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అధిష్ఠానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలను ఎదుర్కొంటానని నానా పటోలె సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 నాటికి మహారాష్ట్రలో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పటోలే సకోలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

click me!