కాంగ్రెస్ బహిష్కరణ: నాలుగోసారి కర్ణాటక సీఎంగా యడియూరప్ప

By narsimha lodeFirst Published Jul 26, 2019, 6:35 PM IST
Highlights

కర్ణాటక సీఎంగా యడియూరప్ప నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. యడియూరప్ప  ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు బహిష్కరించాయి.

బెంగుళూరు: కర్ణాటక సీఎంగా యడియూరప్ప శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు బహిష్కరించాయి.

రాజ్‌భవన్ వరకు యడ్యూరప్ప  ర్యాలీగా చేరుకొన్నారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అసంతృప్త ఎమ్మెల్యే రోషన్ బేగ్ హాజరయ్యారు.కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. విశ్వాస పరీక్ష తర్వాతే యడ్యూరప్ప మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

2007లో తొలిసారిగా కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2008లో కూడ ఆయన మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు.అవినీతి ఆరోపణలతో2011లో యడ్యూరప్ప సీఎం పదవి నుండి వైదొలిగారు. అవినీతి ఆరోపణల కారణంగానే ఆయన పదవి నుండి తప్పుకొన్నారు.

2018లో మూడోసారి యడియూరప్ప ప్రమాణం చేశారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో మూడో సారి ప్రమాణం చేసిన కొద్దిరోజుల్లోనే ఆయన పదవిని కోల్పోయాడు. కుమారస్వామి విశ్వాసపరీక్షలో ఓటమి పాలు కావడంతో ఇవాళ నాలుగోసారి యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. 

నాలుగో సారి యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్) బహిష్కరించాయి. రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించిందనే ఆరోపణతో  కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. 

click me!