పీఎం మోడీ ఊరు వాద్‌నగర్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కు సంబంధమేంటి?

By Mahesh Rajamoni  |  First Published Jan 10, 2025, 10:24 PM IST

Modi-Xi Jinping: త‌న మొద‌టి పోడ్‌కాస్ట్ లో ప్రధాని న‌రేంద్ర మోడీ తన గ్రామం వాద్‌నగర్‌ను, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎందుకు సందర్శించారు? ప్రత్యేక సంబంధమేంటో తెలిపారు. 


Modi-Xi Jinping: జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన “పీపుల్ బై WTF” (People by WTF) పాడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అనేక విషయాలు ప్రస్తావించారు. తన చిన్ననాటి విషయాలతో పాటు ఇప్పటివరకు సాగిన విషయాలు ప్రస్తావించారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఆందోళనలను పంచుకుంటూ ఎలా ముందుకు సాగరో.. ఎలా ఈ స్థాయికి వచ్చారనే విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే, తాను జన్మించిన గుజరాత్ లోని వాద్ నగర్ గ్రామాన్ని  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సందర్శించాలనే కోరిక వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ప్రధాని ప్రస్తావించారు.

Latest Videos

1,400 ఏళ్ల నాటి చారిత్రక సంబంధం 

చైనా అధ్యక్షుడు, తన సొంత ఊరు వాద్ నగర్ కు మధ్య ఉన్న 1,400 ఏళ్ల నాటి చారిత్రక సంబంధం గురించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ సంబంధం హుయాన్‌త్సాంగ్ అనే ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్తతో ముడిపడి ఉందని తెలిపారు. మోడీ ఈ విషయాన్ని వివరిస్తూ.. జీ జిన్‌పింగ్ 2014లో మర్యాదపూర్వక పర్యటన సందర్భంగా వ్యక్తిగత సంబంధాన్ని ఉటంకిస్తూ గుజరాత్‌ను సందర్శించాలనే తన కోరికను వ్యక్తం చేశారన్నారు. "అధ్యక్షుడు జీ జిన్ పింగ్ 2014లో మర్యాదపూర్వక పర్యటన సందర్భంగా.. నేను భారతదేశానికి వచ్చి గుజరాత్‌ను సందర్శించాలనుకుంటున్నానని నాతో అన్నారు. నాకు, ఆయనకు మధ్య ప్రత్యేక సంబంధం ఉందని ఆయన నాతో చెప్పారు" అని మోడీ అన్నారు.

హుయాన్‌త్సాంగ్ భారత్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వాద్ నగర్ లో ఉన్నారనీ, చైనాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన జీ జిన్ పింగ్ గ్రామంలో ఉన్నారని జీ ప్రస్తావించారని పోడ్ కాస్ట్ లో గుర్తుచేసుకున్నారు. ఈ చారిత్రక సంబంధం 2014లో మోడీ 64వ పుట్టినరోజున జరిగిన జీ జిన్ పింగ్ గుజరాత్ పర్యటనకు ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ఆయన పర్యటనలో హుయాన్‌త్సాంగ్ కాలం నాటి వాద్ నగర్ బౌద్ధ మూలాలను హైలైట్ చేసే చిత్ర గ్యాలరీని చూపించారు. ఈ గ్రామంలో ఒకప్పుడు 10 బౌద్ధ మఠాలు ఉండేవని హుయాన్‌త్సాంగ్ రాశారు. హుయాన్‌త్సాంగ్ రచనలను పురావస్తు గ్రంథాలు ధృవీకరించాయి.

వాద్ నగర్ చెరువులో ఈత కొట్టాను : ప్రధాని మోడీ 

వాద్ నగర్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మోడీ పంచుకున్నారు. అక్కడ ఆయన తన కుటుంబంతో కలిసి బట్టలు ఉతికాననీ, గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకున్నానని చెప్పారు. “నేను మా కుటుంబంలో ప్రతి ఒక్కరి బట్టలు ఉతికేవాడిని, దాని వల్ల నాకు చెరువుకు వెళ్లడానికి అనుమతి లభించేది” అని ఆయన అన్నారు. తాను సాధారణ విద్యార్థినేననీ, అయితే, తనలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. “నేను పోటీ ఉన్న ఏ విషయం నుండి అయినా పారిపోయేవాడిని” అని ఆయన నవ్వుతూ చెప్పారు.

2014 పర్యటన వాద్ నగర్, జీ జిన్ పింగ్ స్వస్థలం చైనాలోని జియాన్ మధ్య చారిత్రక సంబంధం, ఈ పర్యటనకు లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడిస్తుంది. హుయాన్‌త్సాంగ్ ద్వారా “ఓ-నాన్-టు-పు-లో” (O-nan-to-pu-lo) అని పిలువబడే వాద్ నగర్ తరువాత ఆనందపురంగా పేరు మార్చబడింది. చారిత్రక పత్రాల ప్రకారం, హుయాన్‌త్సాంగ్ పర్యటన సమయంలో ఈ ప్రాంతాన్ని కన్నౌజ్‌కు చెందిన హర్షవర్ధనుడు పాలించాడు. ఈ తత్వవేత్త అతని ఆస్థానాన్ని కూడా సందర్శించాడు.

ఇవి కూడా చదవండి:

ఆశయం కాదు లక్ష్యంతో రండి.. నా జీవితంలో అదే అతిపెద్ద ప‌రీక్ష: ప్రధాని మోడీ

click me!