కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

By Sandra Ashok Kumar  |  First Published Nov 23, 2019, 6:21 PM IST

ముంబైలో శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన సంఘటనలకు మరియు 13 సంవత్సరాల క్రితం బెంగళూరులో జరిగిన వాటికి మధ్య చాలా సారూప్యత కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని దించాలని, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని, జనతాదళ్ (సెక్యులర్) ను నిట్ట నిలువునా చీల్చారు.  


ముంబైలో శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన సంఘటనలకు మరియు 13 సంవత్సరాల క్రితం బెంగళూరులో జరిగిన వాటికి మధ్య చాలా సారూప్యత కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని దించాలని, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని, జనతాదళ్ (సెక్యులర్) ను నిట్ట నిలువునా చీల్చారు.  

తండ్రి కొడుకులిద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తమను మోసం చేశారంటే, తమను మోసం చేశారంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ రోడ్డుకెక్కారు. చివరకు జరిగింది ఏమిటి? 20 నెలల తరువాత కుమారా స్వామి తన కొత్త మిత్రుడు బీజేపీకి విడాకులిచ్చాడు. మల్లి తండ్రి కొడుకులు ఒక్కటయ్యారు. 

Latest Videos

గౌడల మాదిరిగానే, మహారాష్ట్రలోని పవార్లు కూడా చాలా సన్నిహితమైన సంబంధాలు కలిగిన కుటుంబం. విద్యా సంస్థలు, ట్రస్టులు, చెక్కర సహకార సంస్థలను, మిల్లులను నడిపించడంలో వారంతా కలిసి పనిచేస్తారు. 

నరసింహ రావు ప్రభుత్వంలో శరద్ పవార్ చేరడానికి అజిత్ పవార్ తన బాబాయి కోసం తన బారామతి లోక్ సభ సీటును వదులుకున్నాడు. 2019 లోక్ సభ ఎన్నికలలో, శరద్ పవార్ తన మనవడు, అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను మవాల్  సీటు నుండి బరిలోకి దింపి తాను రేసు నుండి వైదొలిగాడు, ఇప్పటికే తన కూతురు కూడా ఉన్నందున తాను వైదొలిగి తన మనవడికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నట్టు తెలిపాడు. 

ఎన్సీపీలో ఇప్పటికే వారసత్వ పోరు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బయటకు సుప్రియా సులే తాను ఢిల్లీలో ఎన్సీపీకి ప్రాతినిధ్యం వహిస్తానని, మహారాష్ట్రలో అజిత్ పవారే శరద్ పవార్ వారసుడని ఆమె పదే పదే చెబుతున్న వారసత్వ యుద్ధం మాత్రం తారా స్థాయికి చేరింది. 

గౌడాల కుటుంబంలో కూడా వారసత్వ పోరు ఏ స్థాయిలో నడుస్తుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవన్న తన కొడుకుని నెక్స్ట్ వారసుడిగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే, కుమారస్వామి తన కొడుకుని చేయడానికి ట్రై చేస్తున్నారు. 

తెరవెనక చక్రం తిప్పిన అమిత్ షా, ఎన్సీపీని తన వైపుకు తిప్పుకోగలిగాడు. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి మద్దతిస్తె, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రివర్గ బెర్తులను ఇస్తామని చెప్పారట. 

అయితే తొలి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్‌ పవార్‌ బీజేపీ నేతలతో చేతులు కలిపినట్లు సమాచారం. అజిత్‌  చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు షాక్‌కి గురయ్యారు.అయితే ఈ వ్యవహారమంతా శరద్‌ పవార్‌కు తెలియకుండా అజిత్‌ పవార్‌ జాగ్రత్త పడ్డారని ఎన్సీపీ వర్గాలంటున్నాయి. 

ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందిన  విషయం తెలిసిందే. 

click me!