లాక్‌డౌన్‌కు పోలీసులకు మద్దతుగా నిలిచిన గిన్నిస్ రికార్డు విజేత

By narsimha lode  |  First Published Apr 14, 2020, 2:23 PM IST
:కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న నాగపూర్ పోలీసులకు  ప్రపంచంలో అతి చిన్న మహిళ జ్యోతి అమ్గే మద్దతుగా నిలిచారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను కోరారు.

నాగ్‌పూర్:కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న నాగపూర్ పోలీసులకు  ప్రపంచంలో అతి చిన్న మహిళ జ్యోతి అమ్గే మద్దతుగా నిలిచారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను కోరారు.

కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్ ను అమలు చేసింది కేంద్రం. ఈ ఏడాది మార్చి 23 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు తొలి విడత లాక్ డౌన్ విధించింది కేంద్రం. మరో వైపు రెండో విడతలో లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

 కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్‌డౌన్‌ అ‍మలును ప్రజలు తప్పనిసరిగా పాటించి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో కలిసి నాగపూర్‌ సమీపంలోని ఇతర ప్రాంతాలలో అవగాహన చర్యలు చేపట్టారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు ఇంట్లోని ఉండి సహకరించాలని. అదే విధంగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.
also read:దేశంలో ఏడాదికి సరిపోను ఆహారధాన్యాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ ప్రాణాంతక వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామి కావాలని నాగపూర్‌ పోలీసులు తనని కోరినట్లు చెప్పారు. వారి పిలుపు మేరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండేలా కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడానికి పోలీసులకు మద్దతుగా వచ్చినట్టుగా తెలిపారు. 26 ఏళ్ల వయసున్న జ్యోతి కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా జ్యోతి గిన్నిస్‌ బుక్‌కు ఎక్కిన సంగతి తెలిసిందే. 
click me!