'సావర్కర్‌ను అవమానిస్తే సహించను': ఉద్ధవ్ 

Published : Mar 27, 2023, 04:25 AM ISTUpdated : Mar 27, 2023, 04:37 AM IST
'సావర్కర్‌ను అవమానిస్తే సహించను': ఉద్ధవ్ 

సారాంశం

ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే టెక్స్‌టైల్ పట్టణం మాలెగావ్‌లో జరిగిన ర్యాలీలో ఠాక్రే ప్రసంగిస్తూ, సావర్కర్ మనకు ఆదర్శమని, ఆయన అగౌరవాన్ని సహించేది లేదని అన్నారు.

లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన తర్వాత తన విలేకరుల సమావేశంలో వీడీ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ఏక్నాథ్ షిండే అభ్యంతరం వ్యక్తం చేయడంతో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు కాంగ్రెస్ నేతపై స్పందించారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ను తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే  తెలిపారు. ఈ సందర్భంగా వీడీ సావర్కర్‌ను దూషించడం మానుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఆయన కోరారు.

ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే టెక్స్‌టైల్ పట్టణం మాలెగావ్‌లో జరిగిన ర్యాలీలో ఠాక్రే ప్రసంగిస్తూ..  సావర్కర్ మనకు ఆదర్శమని, ఆయన అగౌరవాన్ని సహించేది లేదని అన్నారు. 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులార్ జైల్లో సావర్కర్ ఊహించలేని హింసను అనుభవించారు. వారి బాధలను మనం చదువుకోవచ్చు. ఇది కూడా త్యాగ రూపమేననీ అన్నారు.  అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీని రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని థాకరే అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే శివసేన (యుబిటి), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అనే మూడు పార్టీల కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఏర్పడిందని, అయితే మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఈ సారి రెచ్చగొడితే..  ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకంగా మారుతుందనీ, ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని ఆయన అన్నారు.

గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు 2019 పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడిన ఒక రోజు తర్వాత, గాంధీ శుక్రవారం లోక్‌సభకు అనర్హుడయ్యాడు. తన అనర్హతపై ఢిల్లీలో శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 'నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరు' అని అన్నారు.

  ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై ప్రశ్నలు 

ఈ సమయంలో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని థాకరే ఆరోపించారు. మళ్లీ సీఎం కావాలనే పోరాటం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడేందుకు ఆయన పోరాడుతున్నారని తెలిపారు.

 కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం 

మరోవైపు.. ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని  మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే  ఆరోపించారు.  ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ ఆరేళ్ల మనవరాలిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయని అన్నారు. ఇది మాత్రమే కాదు..  లాలూ ప్రసాద్ యాదవ్ గర్భవతి అయిన కోడలు స్పృహతప్పి పడిపోయే వరకు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారిని విమర్శిస్తే పోలీసులు వెంటే ఉంటారని ఠాక్రే అన్నారు. మన స్వాతంత్ర్య సమరయోధులు దీని కోసం ప్రాణాలర్పించారా? అని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu