మ‌హిళ శ‌క్తి.. నక్సల్స్ ప్రాంతంలో 1,800 కిలోమీటర్లు ప్రయాణించనున్న మహిళా సీఆర్పీఎఫ్ బైకర్లు

Published : Mar 08, 2023, 12:44 PM IST
మ‌హిళ శ‌క్తి..  నక్సల్స్ ప్రాంతంలో 1,800 కిలోమీటర్లు ప్రయాణించనున్న మహిళా సీఆర్పీఎఫ్ బైకర్లు

సారాంశం

Women's Day 2023: మహిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నక్సల్స్ ప్రాంతంలో తొలిసారి 1,800 కిలోమీటర్లు 75 మంది మహిళా సీఆర్పీఎఫ్ బైకర్లతో కూడిన బృందం ప్ర‌యాణించ‌నుంది. సిబ్బంది తమ అధికారిక ఎన్ఫీల్డ్ బుల్లెట్లను నడుపుతార‌నీ, కోబ్రా శిబిరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేత జెండా ఊపి దినిని ప్రారంభిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.  

CRPF Women Bikers: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన 75 మంది మహిళా బైకర్ల బృందం ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్ లోని న‌క్స‌ల్స్ ప్రభావిత ప్రాంతంలో 1,848 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనుంది. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళానికి చెందిన సిబ్బందిని మార్చి 9న ఇండియా గేట్ నుంచి ప్రారంభ‌మై.. 25న ఛత్తీస్ గఢ్ లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలోని జగదల్ పూర్ వద్ద తమ ప్రయాణాన్ని ముగించనున్నారు. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మహిళా శక్తి సందేశాన్ని ఈ బైకర్ల బృందం పంపుతుంద‌నీ, ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కూడా ఈ బైకర్లు నిర్వహిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. 

ఈ సిబ్బంది తమ అధికారిక ఎన్ఫీల్డ్ బుల్లెట్లను నడుపుతారనీ, ఈ నెల 25న బస్తర్ జిల్లా కేంద్రమైన జగదల్పూర్ లోని కరణ్ పూర్ ప్రాంతంలోని కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) శిబిరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మార్చి 25న జగదల్ పూర్ లో 84వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది. ఎల్ డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతంలో వార్షిక కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. మార్చి 19న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా 25వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

సీఆర్పీఎఫ్ తన 83వ వార్షికోత్సవాన్ని గత ఏడాది జమ్మూలో నిర్వహించింది. ఈ కార్యక్రమాలను దేశ రాజధాని వెలుపల నిర్వహించాలని ప్రభుత్వం అన్ని పారామిలటరీ లేదా సిఎపిఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్) ను కోరింది. 1939 లో సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేశారు. న‌క్స‌ల్స్ తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు నిరోధక చర్యలు, జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అనే మూడు ప్రధాన విభాగాల్లో పనిచేస్తున్న ప్రధాన జాతీయ అంతర్గత భద్రతా దళంగా 3.25 లక్షల మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద భ‌ద్ర‌తా బ‌ల‌గంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu