రాత్రి బయటకు వెళ్లే మహిళలంతా వేశ్యలే.. వివాదాస్పద వ్యాఖ్యలు

By telugu news teamFirst Published Jul 17, 2021, 3:17 PM IST
Highlights

స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.


రాత్రిపూట 9 దాటిన తర్వాత బయటకు వెళ్లే మహిళలంతా వేశ్యలేనని... వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు కాదంటూ  కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2011లో జరిగిన ఓ అత్యాచారాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా గాయపరిచాడు. ఐదు రోజుల తర్వాత ఆమె మరణించింది. స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.

ఈ ఘటన గురించి స్వాలి బత్రే తాజాగా మాట్లాడుతూ.. `రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది. అందులో అతని తప్పేం ఉంది. రాత్రిపూట బయట కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం, చంపడం తప్పు కాద`ని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. కేరళలో ముస్లిం మతాధికారులలో 27 ఏళ్ల స్వాలి బత్రే ఒకరు. ఆయన హెచ్‌డీపీ సిండ్రోమ్‌తో బాధపడుతుండడంతో 27 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలానే ఉంటారు. కాగా, ఈయన ఇప్పటికే ఇలాంటి ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేశారు. 
 

click me!