పీకలదాకా తాగి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. రైల్వే సేవలకు అంతరాయం..!

Published : Jul 17, 2021, 01:16 PM ISTUpdated : Jul 17, 2021, 01:19 PM IST
పీకలదాకా తాగి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. రైల్వే సేవలకు అంతరాయం..!

సారాంశం

అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్.. పీకలదాకా మద్యం సేవించి నిద్రపోయాడు. అధికారులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదు. 

డ్యూటీ చేయాల్సిన స్టేషన్ మాస్టర్ పీకలదాకా మద్యం తాగి నిద్రపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీ- హౌరా మార్గంలో ప్రయాణించాల్సిన రైలు మార్గంలో అంతరాయం ఏర్పడింది.  అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్.. పీకలదాకా మద్యం సేవించి నిద్రపోయాడు. అధికారులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదు. దీంతో.. ఏమైందోనని అధికారులు పరుగున వచ్చి చూసే సరికి గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించాడు.ధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ల్లీకి చెందిన అనిరుద్‌ కుమార్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులకు హజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్‌ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు అనిరుద్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు.

 ఎంతసేపటికి ఫోన్‌ తీయకపోవడంతో అధికారులు వచ్చి చూడగా.. అనిరుద్‌ కుమార్‌ దర్జాగా నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అనిరుద్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసి తుండ్లాలోని మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తరలించారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఇలాంటి అధికారులు ఉండడంతోనే దేశం ఇలా తగలడింది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport