బలవంతంగా బట్టలు విప్పించారు.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళకు చేదు అనుభవం..

By SumaBala BukkaFirst Published Jan 4, 2023, 12:35 PM IST
Highlights

బెంగుళూరు విమానాశ్రయం అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆమెను అలా అడిగి ఉండాల్సింది కాదని అన్నారు. 

బెంగళూరు : బెంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళా సంగీత విద్వాంసురాలికి అవమానం ఎదురయ్యింది. సెక్యురిటీ తనిఖీల్లో ఆమెను చొక్కా విప్పమని అధికారులు అడిగారు. ఈ మేరకు ఆమె ఇది ‘అవమానకరమైన అనుభవం’ అని పేర్కొన్నారు. సెక్యూరిటీ తనిఖీలకు బట్టలు విప్పాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. దీనిమీద బెంగళూరు విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఆపరేషన్స్,  సెక్యూరిటీ టీమ్‌లకు తెలిపినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయంలో భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిర్వహిస్తుంది.

ఆమె ఈ మేరకు తన ట్విటర్ లో విమానాశ్రయంలో తనకు జరిగిన అవమానాన్ని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. ఈ ట్వీట్ ను ఆమె నిన్న సాయంత్రం పోస్ట్ చేస్తూ, "బెంగళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో నా షర్ట్‌ను తీసివేయమని అడిగారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో కేవలం కామిసోల్ ధరించి, అర్థనగ్నంగా ఉండటం నిజంగా అవమానకరం. ఒక మహిళగా పదిమంది దృష్టిలో అలా పడాలని ఎవ్వరూ కోరుకోరు’’ అన్నారు. 

దీనికి బెంగళూరు విమానాశ్రయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ప్రతిస్పందించింది. "ఇది జరగాల్సింది కాదు" అని పేర్కొంది.  మహిళా ప్రయాణీకురాలు తన కాంటాక్ట్ వివరాలను షేర్ చేయాలని అభ్యర్థించారు, తద్వారా తాము ఆమెను సంప్రదించి.. తనకు జరిగిన అసౌకర్యాన్ని తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. 

షాకింగ్.. విమానంలో మహిళపై మూత్ర విసర్జన,ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..అసభ్య ప్రవర్తన.. చివరికి..

"మా వల్ల కలిగిన ఘటనకు తీవ్రంగా చింతిస్తున్నాము . ఇది జరగకూడదు. దీన్ని మేము మా ఆపరేషన్స్ టీంకి తెలుపుతాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించే భద్రతా బృందానికి కూడా దీనిని పంపుతాం" అని తెలిపింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ రీ ట్వీట్ తొలగించారు.

విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల సమయంలో సమస్యలు తలెత్తడం పెద్ద చర్చనీయాంశమైంది. రెండేళ్ల కోవిడ్ మహమ్మారి లాక్ డౌన్ తరువాత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో, విహారయాత్రకు బయలుదేరిన పర్యాటకులతో విమానాశ్రయాలు నిండిపోయాయి. గత నెల, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో కిక్కిరిసిన దృశ్యాలు, ప్రయాణికుల పొడవైన క్యూలైన్లు కనిపించాయి. దీంతో ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఆలస్యం, భద్రతా తనిఖీ సమయంలో భయంకరమైన అనుభవాల గురించి ఫిర్యాదు చేశారు.

సీఐఎస్ఎఫ్ లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారని బెంగళూరు విమానాశ్రయం తెలిపింది. అంతేకాదు "బెంగళూరు విమానాశ్రయం దీనిపై నియంత్రణ లేదు. సెక్యూరిటీ చెక్ లను చక్కగా నిర్వహించాల్సింది సిఐఎస్‌ఎఫ్‌. మేము కొంత వరకు సాయం ఇస్తున్నాము. అయితే, కొంత వరకు మాత్రమే మద్దతు ఇవ్వగలుగుతున్నాం. సిఐఎస్‌ఎఫ్‌లో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇక, ఇమ్మిగ్రేషన్ కేంద్ర అధికారులు మేనేజ్ చేస్తున్నారు’ అని ఓ సోర్స్ చెప్పారు.  

ఏవియేషన్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కొత్త స్కానర్‌లు వస్తున్నాయని, ప్రయాణికులు ఇకపై లగేజీ స్క్రీనింగ్ కోసం ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు , ఛార్జర్‌లను లగేజీ నుంచి తీయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనివల్ల భద్రతా తనిఖీలు తొందరగా పూర్తవుతాయి. విమానాశ్రయాల్లో రద్దీ తగ్గుతుంది.

click me!