మోదీకి సవాల్ విసిరి ఓడిపోయా...కానీ: మాజీ ప్రధాని దేవెగౌడ

By Arun Kumar PFirst Published Feb 14, 2019, 4:26 PM IST
Highlights

రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు వినురుకోవడం కామన్ గా వింటుంటాం. కానీ అలా విసిరిన సవాళ్ళను సీరియస్ గా తీసుకునే నాయకులు చాలా తక్కువగా వుంటారు. అలాంటిది తాను విసిరిన ఛాలెంజ్ కోసం ఏకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడినట్లు మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. కానీ అందుకు నరేంద్ర మోదీ అడ్డుచెప్పారని....అందువల్లే ఈ ఐదేళ్లు ఎంపిగా కొనసాగినట్లు దేవెగౌడ లోక్ సభ సాక్షిగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం కొనసాగుతున్న 16వ లోక్ సభ చివరి సమావేశాల సందర్భంగా దేవెగౌడ గత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రసంగించారు. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని అభ్యర్థిగా వున్న మోదీ ప్రతి సమావేశంలోనూ బిజెపి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రకటించేవారని అన్నారు. దాంతో ఈ ఎన్నికల్లో మీరు(బిజెపి) 276 కంటే ఎక్కువ ఎంపీలను గెలిపించుకుంటే తాను ఎంపీగా గెలిచినా వెంటనే రాజీనామా చేస్తానని మోదీకి సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో బిజెపి పార్టీ 282 సీట్లు  సాధించడంతో తన ఛాలెంజ్ ప్రకారం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని భావించినట్లు దేవెగౌడ్ తెలిపారు. 

అయితే ఈ విషయం తెలుసుకుని మోదీ ఈ సవాల్ ను సీరియస్ గా తీసుకోవద్దంటూ తన రాజీనామాను అడ్డుకున్నారని దేవెగౌడ వెల్లడించారు. మీలాంటి అనుభవజ్ఞులు రాజకీయాలకు దూరమవడం మంచిది కాదని  మోదీ అన్నారని గుర్తు చేశారు. అందువల్లే తాను ఈ ఐదేళ్లు ఎంపీగా కొనసాగినట్లు దేవెగౌడ లోక్ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.  

click me!