
న్యూఢిల్లీ : దేశ రాజదాని ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూఢిల్లీలోని దేవ్లీ రోడ్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు 23 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు అధికారులకు మంగళవారం సమాచారం అందింది. మృతుడిని రాహుల్‌గా గుర్తించారు.
"మార్చి 12, 13 మధ్య రాత్రి, దేవ్లీ రోడ్‌లోని ఒక హోటల్ నుండి నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌కు ఉరి పిసిఆర్ కాల్ వచ్చింది. ఓ వ్యక్తి హోటల్ గదిలో ఉరివేసుకుని కనిపించాడని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మేము హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాం. గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న వ్యక్తిని కనుగొన్నాం" అని ఒక అధికారి తెలిపారు. అన్నారు.
దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. క్రైమ్ టీమ్ మృతదేహాన్ని పరిశీలించింది. తరువాత సెక్షన్ 174 ప్రకారం తగిన విచారణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ మార్చురీకి మృతదేహాన్ని పంపించారు. పోలీసులు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఢిల్లీ పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి హోటల్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
"ఢిల్లీ పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి హోటల్‌కి వచ్చాడు. అతను తనను తాను జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నబాబ్ అని పరిచయం చేసుకున్నాడు.. అని తెలిసింది. అయితే, అతను దీనికి సంబంధించి.. ఎటువంటి గుర్తింపు కార్డును చూపించలేకపోయాడు" అని అధికారి తెలిపారు. దీంతో అతనిపై తప్పుడు వేషధారణ కేసు నమోదైంది. ఈ కేసు మీద విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో ఓ ముగ్గురు స్నేహితులో తమతో పాటే వచ్చిన తమ స్నేహితుడు గాయాల పాలైతే.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అండర్ పాస్ లో పడేసి వెళ్లిపోయారు. దీంతో చికిత్స అందగా ఆ తరువాత అతను మృతి చెందాడు. ఈ ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. నలుగురు స్నేహితులు ఓ ఆటోలో వెడుతుండగా.. ఆటో బోల్తా పడింది. దీంతో అందులోని ఓ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, మిగతా ముగ్గురు స్నేహితులు తమ స్నేహితుడి మృతదేహాన్ని దేశ రాజధానిలోని వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో పడేసినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వారు ప్రయాణిస్తున్న ఆటో రిక్షా ప్రమాదానికి గురైంది, వారిలో ఒకరు గాయపడ్డారు.
"గాయపడిన అతను ఆ తరువాత మరణించాడు. అతనిని అతని ముగ్గురు స్నేహితులు అదే ఆటో-రిక్షాలో సంఘటన స్థలం నుండి తీసుకువెళ్లారు, అయినప్పటికీ, వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా, వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్‌పాస్ వద్ద పడేసి వెళ్లారు" అని పోలీసులు తెలిపారు. అధికారి చెప్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆటో రిక్షా ముగ్గురు నిందితులలో ఒకరిది. "వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. దీనిమీద విచారణ జరుగుతోంది" అని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. .