ఐదు నెలల పిండాన్ని చేతపట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన యువతి....

Published : Jul 23, 2018, 10:53 AM IST
ఐదు నెలల పిండాన్ని చేతపట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన యువతి....

సారాంశం

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడే ఆ యువతిని మోసం చేశాడు. తన కామ వాంఛ తీర్చుకుని కడుపు చేసి వదిలించుకోవాలని చూశాడు. అయితే పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసిన యువతి చేత గర్భస్రావ మాత్రలు మింగించి అబార్షన్ అయ్యేలా చేసి పరారయ్యాడు. దీంతో ఆమె తన ఐదునెలల మృత పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.  

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడే ఆ యువతిని మోసం చేశాడు. తన కామ వాంఛ తీర్చుకుని కడుపు చేసి వదిలించుకోవాలని చూశాడు. అయితే పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసిన యువతి చేత గర్భస్రావ
మాత్రలు మింగించి అబార్షన్ అయ్యేలా చేసి పరారయ్యాడు. దీంతో ఆమె తన ఐదునెలల మృత పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన ఓ యువతిని అదే ప్రాంతంలో ఉండే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. దీంతో యువతి అతడికి తన సర్వస్వాన్ని సమర్పించింది. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఆరు నెలలుగా వీరిద్దరు శారీరకంగా కలుస్తుండటంతో  ఆమె గర్భం దాల్చింది. దీంతో యువతి తనకు గర్భం వచ్చిందని, వెంటనే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా, తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఆమె మరింతగా ఒత్తిడి తేవడంతో గర్భస్రావం మాత్రలు తెచ్చి బలవంతంగా మింగించాడు. దీంతో ఆమెకు గర్భస్రావమైంది.

తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఇలా గర్భస్రావ మాత్రలు మింగించాడని భాదితురాలికి అర్థమైంది. దీంతో మృత పిండాన్ని ఓ సంచిలో వేసుకుని హాస్పిటల్ నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే