ఎంపీపై అత్యాచారం ఆరోపణలు.. యువతి మృతి

Published : Aug 25, 2021, 09:56 AM ISTUpdated : Aug 25, 2021, 09:59 AM IST
ఎంపీపై అత్యాచారం ఆరోపణలు.. యువతి మృతి

సారాంశం

సుప్రీం కోర్టు వెలుపల తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16న ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ యువకుడు(27) శనివారం మరణించాడు. యువతి తాజాగా ప్రాణాలు విడిచింది.

తనపై ఎంపీ అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తనపై ఎంపీ అత్యాచారం చేశాడని.. వారాణసీ పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారని ఆవేదన చెందిన యువతి(24) మంగళవారం తుది శ్వాస విడిచింది. సుప్రీం కోర్టు వెలుపల తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16న ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ యువకుడు(27) శనివారం మరణించాడు. యువతి తాజాగా ప్రాణాలు విడిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన సదరు యువతిపై బీఎస్పీ ఎంపీ అతుల్‌ రాయ్‌ అత్యాచారం చేశాడంటూ 2019లో కేసు నమోదైంది. అది కోర్టు విచారణలో ఉంది. కొందరు పోలీసు అధికారులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. కేసు విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంను ఆ యువతి అభ్యర్థించింది.. అదీ పెండింగ్‌లోనే ఉంది. ఇదిలా ఉండగా.. ఫోర్జరీ కేసులో ఆ యువతికి ఈ నెలలో వారాణసీ స్థానిక కోర్టు నాన్‌-బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసును రాయ్‌ సోదరుడు వేయడం గమనార్హం. న్యాయానికి దూరమవుతున్నాననే అవేదనతో స్నేహితుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు బాధిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం