భర్తకు అన్నంలో మత్తుమందు కలిపిచ్చి.. ముసుగేసి దారుణంగా కొట్టి... నగలు, నగదుతో భార్య పరార్.. అరెస్ట్..

Published : Jan 27, 2022, 11:20 AM ISTUpdated : Jan 27, 2022, 11:38 AM IST
భర్తకు అన్నంలో మత్తుమందు కలిపిచ్చి.. ముసుగేసి దారుణంగా కొట్టి... నగలు, నగదుతో భార్య పరార్.. అరెస్ట్..

సారాంశం

మత్తుమందుతో బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు అతని మీద దాడి చేసింది. అచేతనంగా పడి ఉన్న అతను చనిపోయాడని భావించిన వారు ఇంటిని దోచుకున్నారు. నగదు, నగలు, ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయారు.  

ఫరీదాబాద్‌ : haryanaలో ఓ భార్య ఘాతుకానికి తెగబడింది. కట్టుకున్న husbandనే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించింది. అతను చనిపోయాడనుకుని, cash and jewelleryతో ఉడాయించింది. ఆమెను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు పురుషుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన Faridabadలో జనవరి 17 -18 మధ్య రాత్రి జరిగింది. ఆ మహిళ భర్తను చంపడానికి ప్రయత్నించి, నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పారిపోయిందని తేలింది. దీనికోసం మహిళ భర్త ఆహారంలో sedatives కలిపి.. అతని మీద దాడి చేసింది. అరవకుండా నోట్లో దుప్పటి కుక్కి తీవ్రంగా గాయపరిచింది. అని బాధితుడు పోలీసులకు తెలిపాడు. 

మత్తుమందుతో బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు అతని మీద దాడి చేసింది. అచేతనంగా పడి ఉన్న అతను చనిపోయాడని భావించిన వారు ఇంటిని దోచుకున్నారు. నగదు, నగలు, ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయారు.  

ఆ రాత్రి ఏం జరిగిందంటే...
ఈ ఘటన జరిగిన జనవరి 17, 18వ తేదీ మధ్య రాత్రి భోజనానికి ముందు దంపతుల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.  అయితే 45 ఏళ్ల బాధితుడు తన భార్యతో నిత్యం గొడవపడేవాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) నరేందర్ కడియన్ పేర్కొన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. 

ఆ తరువాత భార్య భర్త ఆహారంలో మత్తుమందు కలిపింది. అది తిన్న భర్త మత్తులోకి జారుకోగానే.. భర్త ముఖాన్ని దుప్పటితో కప్పి.. దాదాపు 20 నిమిషాల పాటు కొట్టింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే పోలీసుల కథనం ప్రకారం, బాధితుడు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం గురించి తెలుసుకున్నాడు. ఇద్దరిమధ్య కొద్దిరోజులు గొడవలు అయ్యి, పరిస్థితులు మళ్లీ మామూలు అయ్యాయి. అయితే బాధితుడు భార్య ఫోన్ చెక్ చేసినప్పుడు అవతలి వ్యక్తి తన అప్పులు తీర్చడానికి త్వరగా డబ్బు సంపాదించాలని.. ఆమెను పెట్టిన మెసేజ్ లు కనిపించాయి. 

మత్తు మందుతో....
ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆ మహిళ తన భర్తకు ఆహారంలో మత్తుమంది కలిపి ఇవ్వడం వల్ల.. అతనికి కళ్లు తిరగడం మొదలై నిద్రపోయాడయని పోలీసు అధికారి తెలిపారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు మేల్కొన్నప్పుడు, అతని శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. ఒళ్లంతా నొప్పులుగా మారిపోయింది. దీంతో జరిగిన విషయం అతనికి బోధపడింది. వెంటే పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో నగదు, నగలు, విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడం..భార్య ఆచూకీ కోసం ప్రయత్నించినా ఆమె కనిపించలేదని పోలీసులకు తెలిపారు.

ఈ మేరకు NIT ఫరీదాబాద్ పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 323 (దాడి), 328 (విషంప్రయోగం), 506 (క్రిమినల్ బెదిరింపు), 379B (స్నాచింగ్ వల్ల గాయపరచడం), 34 (సాధారణ ఉద్దేశం)ల కింద కేసు నమోదు చేశారు,. విచారణ ప్రారంభించి, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు