నకిలీ ఏసీబీ అధికారిని.. చెప్పుతో చితకబాదిన మహిళ

Published : May 08, 2019, 10:51 AM IST
నకిలీ ఏసీబీ అధికారిని.. చెప్పుతో చితకబాదిన మహిళ

సారాంశం

ఏసీబీ అధికారినంటూ చెలామణి అవుతున్న ఓ నకిలీ అధికారిని ఓ మహిళ చితకబాదింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా... చెప్పుతో చితకబాదింది. 

ఏసీబీ అధికారినంటూ చెలామణి అవుతున్న ఓ నకిలీ అధికారిని ఓ మహిళ చితకబాదింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా... చెప్పుతో చితకబాదింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో  చోటుచేసుకుంది.. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తికి మహిళ సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ... ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఏసీబీ అధికారినంటూ చెప్పి, ఫేక్‌ ఐడీతో  ఝార్ఖండ్ లోని మ్యాంగోలో నివసించే ఓ మహిళను రూ.50 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు జంషెడ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అరుణ్‌ మెహతా తెలిపారు. అతను నకిలీ అధికారని గుర్తించిన మహిళ తగిన విధంగా బుద్ధి చెప్పింది. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ