నేను ఓటేస్తుంటే, మీడియాను ఆపుతావా: మహిళా కానిస్టేబుల్‌పై మంత్రి ఫైర్

By Siva KodatiFirst Published May 8, 2019, 7:37 AM IST
Highlights

తాను ఓటేస్తుండగా ఫోటో తీసేందుకు మీడియాను అనుమతించకపోవడంతో సహనం కోల్పోయిన భన్వర్‌లాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మంత్రినే ఆపుతావా..? ఎంత ధైర్యం నీకు.. నేను రాష్ట్ర మంత్రినని తెలీదా అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ఓ మహిళా కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డారు రాజస్థాన్ మంత్రి. వివరాల్లోకి వెళితే.. ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా రాజస్థాన్‌లోని చురు జిల్లా సుజన్‌గఢ్‌లోని వార్డ్ నెంబర్ 20లో ఓటేసేందుకు మంత్రి భన్వర్‌లాల్ మేఘ్‌వాల్ వచ్చారు.

అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్‌లోకి మీడియాను అనుమతించరాదు. దీనిలో భాగంగానే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ మనీషా మీడియాను అనుమతించలేదు.

అయితే తాను ఓటేస్తుండగా ఫోటో తీసేందుకు మీడియాను అనుమతించకపోవడంతో సహనం కోల్పోయిన భన్వర్‌లాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మంత్రినే ఆపుతావా..? ఎంత ధైర్యం నీకు.. నేను రాష్ట్ర మంత్రినని తెలీదా అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతోంది. మంత్రి వైఖరిని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. 

click me!