చోరీల చెంచులక్ష్మి.. కన్నుపడిందంటే తాళం పగలాల్సిందే.. దొంగతనాల్లో డబుల్ సెంచరీ..

Published : Dec 16, 2022, 10:58 AM ISTUpdated : Dec 16, 2022, 10:59 AM IST
చోరీల చెంచులక్ష్మి.. కన్నుపడిందంటే తాళం పగలాల్సిందే.. దొంగతనాల్లో డబుల్ సెంచరీ..

సారాంశం

200 దొంగతనాలు చేసిన ఓ కిలేడీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడడం ఆమె స్టైల్.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీసులు దొంగతనాల కేసులో ఓ యువతిని అరెస్టు చేశారు. ఆమె ఇప్పటి వరకు చేసిన దొంగతనాల గురించి విని షాకయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని.. తాళం పగలగొట్టి చోరీలకు పాల్పడడం ఆమె స్టైల్. ఇప్పటివరకు రెండు వందలకు పైగా ఇలాంటి చోరీలు ఆమె చేసింది. మూడు కమిషనరేట్లలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంగతనాలు చేసినట్టు తేలింది. దీంతో ఇప్పటికే ఆమె డబుల్ సెంచరీ పూర్తి చేసింది. ఓ దొంగతనం కేసులో రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరో  డేటాబేస్ కేంద్రంలోని వేలిముద్రలతో ఆమె వేలిముద్రలు పోలడంతో.. చోరీ జరిగిన గంటల్లోనే పోలీసులు  ఆమెను పట్టుకోగలిగారు. 

ఈనెల 12 13 తేదీల్లో అంబర్పేట బురుజు గల్లీలో రెండు దొంగతనాలు జరిగాయి. అక్కడి హనుమాన్ ఆలయం తాళాలు పగలగొట్టి వెండి పాదుకలు, పూజాసామాగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే మారుతి నగర్ లోని మరో ఇంట్లో బంగారం, వెండి వస్తువులు చోరీ అయ్యాయి. ఆలయంలో  వేలిముద్రలు దొరికాయి. వీటితో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వీటి ఆధారంగా మల్లేపల్లి మాంగార్ బస్తీకి చెందిన చెంచులక్ష్మి  అలియాస్ గడ్డం లక్ష్మి (33)ని నిందితురాలిగా గుర్తించారు. వెంటనే అరెస్టు చేశారు. ఆ తర్వాత  ఆమె దగ్గర నుంచి  44 తులాల వెండి సామాగ్రి, 1.6 తులాల బంగారు ఆభరణాలు.. ఫోన్లు వీటితో పాటు  తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

వైరల్.. యాదాద్రిలో ‘హెలికాప్టర్’కి వాహనపూజ.. నెట్టింట్లో తెలంగాణ వ్యాపారవేత్త ఫొటోలు హల్ చల్.. అతనెవరంటే..

లక్ష్మీ  దొంగతనాలు చేసే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.  ఒక ఇంట్లో ఒక ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నప్పుడు. ఆ ఇంటికి తాళం వేసి ఉందా లేదా చూసుకుంటుంది. ఆ తర్వాత తాళం పగల తాళం పగులగొట్టే సమయంలో ఇతర ఇళ్లలోని వారు లేస్తే ప్రమాదమని.. చుట్టుపక్కల ఇళ్ళకి  తలుపులు  బయటి నుంచి గోల పెడుతుంది.  అని పోలీసులు తెలిపారు. చెంచులక్ష్మి పదహారేళ్ళ వయసు నుండే దొంగతనాలకు అలవాటు పడింది.  కుటుంబ భారం మోయడానికి ఆమె దొంగతనాలను అలవాటు చేసుకుంది. 

ఇక లక్ష్మీ దొంగతనానికి వెళ్లిన ఇంటికి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగానే..  ఇంట్లో తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతుంది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుని బయటపడుతుంది. హైదరాబాదులోని ఓ జైల్లో ఉన్నప్పుడు..  అక్కడ పెట్రోల్ బంక్ లో కొద్ది కాలం పని చేసింది. హైదరాబాదులోని గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేస్తుంది. చెంచులక్ష్మిది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. దొంగతనాల్లో ఆమె తన ఇంటి పక్కన ఉండే రేణుక, పద్మ, సాలమ్మల సాయం కూడా  తీసుకుంటుంది. వారు కూడా ఈమెతో పాటు దొంగతనాలకు వెళుతుండేవారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో చెంచులక్ష్మి ఒక్కతే దొంగతనాలకు వెడుతోందని పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !