కూతుళ్లపై కొన్నేళ్లుగా భర్త అత్యాచారం, భార్య మద్దతు: కూతుళ్లను కొట్టి....

By telugu teamFirst Published Jul 11, 2020, 7:31 PM IST
Highlights

తన ముగ్గురు కూతుళ్లపై ఓ తండ్రి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆ అమ్మాయిల తల్లి తన భర్తకే మద్దతు ఇచ్చింది. పైగా కూతుళ్లను కొట్టడమే కాకుండా వారిని బెదిరించింది. ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ తిరస్కరించింది.

ముంబై: సభ్య సమాజం తలదించుకునే సంఘటన మహరాష్ట్రలో జరిగింది. కూతుళ్లుపై తండ్రి కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాైడు. ఆ విషయం తల్లికి చెప్పారు. అయితే తల్లి కూతుళ్లను కొట్టి, దాని గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించింది. ఈ కేసులో కూతుళ్ల తల్లికి బొంబాయి కోర్టు బెయిల్ తిరస్కరించింది. 

ఆ దారుణమైన సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, వాస్తవంగా ఇది ప్రకృతి విరుద్ధమైన ఘటన అని కోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన కాజీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. 

నిందితుడు హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ ఏాడది మార్చి 31వ తేదీన తన 20 ఏళ్ల పెద్ద కూతురిపై అతను అత్యాచారం చేశాడు. దాంతో మిగతా ఇద్దరు కూతుళ్లు ఏడుస్తూ అల్లరి చేశారు. తల్లిదండ్రులు వారిని ఓ గదిలో వేసి దారుణంగా కొట్టారు. చివరకు ఎదో విధంగా తమ పరిస్థితి గురించి ,స్నేహితుడికి చెప్పగలిగారు. 

అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు హెడ్ మాస్టర్ ఇంటికి చేరుకుని బాధితులను విడిపించి కేసు నమోదు చేశారు. కొన్నేళ్లుగా అమ్మాయిలు నరకం అనుభవించారు.  2012 నుంచి తనపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడని పెద్ద కూతురు పోలీసులకు చెప్పింది. దాని గురించి తల్లికి చెప్తే తననే కొట్టిందని ఫిర్యాదు చేసింది. 

తన 18 ఏళ్ల చెల్లెపై ఐదో తరగతి చదువుతున్న సమయంలో తమ తండ్రి అత్యాచారం చేశాడని, అప్పుడు కూడా తమ తల్లి తండ్రి చేస్తున్న క్రూరకృత్యం గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించిందని ఆమె తెలిపింది. రెండేళ్ల క్రితం తన రెండో చెల్లెపై కూడా అత్యాచారం చేసాడని ఆమె చెప్పింది. కొన్నేళ్లుగా తమ తండ్రి చేతిలో తాము నరకం అనుభవిస్తున్నామని బాధితురాలు చెప్పింది. తమ తల్లి కూడా తండ్రికే మద్దతు ఇస్తోందని చెప్పింది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు దంపతులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ పెద్ద కూతురు చెడు తిరుగుళ్లు తిరుగుతుంటే మందలించామని, అందుకే తమ తప్పుడు ఆరోపణలు చేస్తోందని తల్లి చెప్పింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరింది. కేసును విచారించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. 

click me!