ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసిన బీజేపీ ‘హెలికాప్టర్ బ్రదర్స్’.. రూ.600 కోట్లు మోసం?

Published : Jul 23, 2021, 09:43 AM IST
ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసిన బీజేపీ ‘హెలికాప్టర్ బ్రదర్స్’.. రూ.600 కోట్లు మోసం?

సారాంశం

విదేశాలలో వ్యాపారం చేస్తున్న వీరికి సొంతంగా హెలికాఫ్టర్ ఉంది. గణేష్ బిజెపి వర్తక విభాగం పదవిలో ఉన్నారు. వీరి ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు ఇస్తామని ప్రజల వద్ద నగదు వసూలు చేశారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించి కమీషన్లు అందజేశారు.

తమిళనాడు : కుంభకోణంలో ఫైనాన్స్ సంస్థ నడిపి నగదు మోసానికి పాల్పడిన బిజెపి నేతపై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. తిరువారూరు జిల్లా మరైయూరుకు చెందిన సోదరులు గణేష్ (50), స్వామినాథన్ (47) తంజావూరు జిల్లా కుంభకోణంలో నివసిస్తున్నారు.  అక్కడ విక్టరీ ఫైనాన్స్,  కోరకై లో గిరీష్ డెయిరీ డైరీ ఫామ్ నడుపుతున్నారు.

విదేశాలలో వ్యాపారం చేస్తున్న వీరికి సొంతంగా హెలికాఫ్టర్ ఉంది. గణేష్ బిజెపి వర్తక విభాగం పదవిలో ఉన్నారు. వీరి ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు ఇస్తామని ప్రజల వద్ద నగదు వసూలు చేశారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించి కమీషన్లు అందజేశారు.

ఇదిలా ఉండగా కోట్లాది రూపాయల నగదు డిపాజిట్ చేసిన పలువురికి కరోనా వైరస్ కారణం చూపి నగదు సక్రమంగా చెల్లించలేదని ఫిర్యాదులు అందాయి. కుంభకోణానికి చెందినజబరుల్లా–ఫిరోజ్‌భాను గణేష్, స్వామినాథన్ రూ.15 కోట్ల వరకు మోసగించినట్లు తంజావూరు  ఎస్పీ దేశ్‌ముఖ్‌ శేఖర్ సంజయ్ కు ఫిర్యాదు చేశారు.  డిఐజి ప్రవేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం  సంస్థ ఉద్యోగులను విచారించారు.

జీఎం శ్రీకాంత్ ను అరెస్టు చేసి పోలీసులు బుధవారం ఉదయం గణేష్ ఇంట్లో తనిఖీలు జరిపారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కుంభకోణంలో రూ. 600 కోట్ల మేరకు మోసం జరిగినట్లు నగరంలో పోస్టర్లు వెలిశాయి. వీటిని అతికించిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతన్ని ఉత్తర జిల్లా సంఘం అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?