Kedarnath: కేదార్‌నాథ్‌ ఆలయంలో అపచారం.. గర్భగుడిలో మహిళ అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగిందంటే..? 

Published : Jun 20, 2023, 07:27 AM IST
Kedarnath: కేదార్‌నాథ్‌ ఆలయంలో అపచారం.. గర్భగుడిలో మహిళ అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగిందంటే..? 

సారాంశం

Kedarnath: కేదార్‌నాథ్ ధామ్ గర్భగుడిలో ఓ మహిళ డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయమై కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తరపున జిల్లా రుద్రప్రయాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా   కేసు నమోదు చేశారు

Kedarnath: ఇటీవల కేదార్‌నాథ్ ధామ్ కు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆలయంలోని గర్భగుడిలో బంగారు తాపడంపై రచ్చ జరుగుతుండగా, తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. ఇందులో గర్భగుడిలోని పవిత్రమైన శివలింగంపై ఓ మహిళ నోట్ల వర్షం కురిపించింది. పూజారులు కూడా ఆ మహిళను అడ్డుకోకపోగా.. అలానే చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) చైర్మన్ ఈ విషయంపై విచారణకు ఆదేశించారు.

బాబా కేదార్ ఆలయానికి సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలోగుడి లోపల డ్యాన్స్ చేయడం, నోట్లను వెదజల్లడం వరకు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలోని శివలింగంపై ఓ మహిళ నోట్లను వెదజల్లుతున్న వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజారులు కూడా మహిళకు పూజలు చేస్తున్నారు. అటు ఆ మహిళను కానీ, ఇటు వీడియో తీసిన వ్యక్తిని కానీ ఆపలేదు. గర్భగుడిలో వీడియో ,ఫోటోగ్రఫీ ఖచ్చితంగా నిషేధించబడింది.

ఆలయ గర్భగుడిలో పవిత్ర లింగంపై (బాబా కేదార్ ) నోట్లను వెదజల్లడంపై ఆలయ పూజారులు మౌనం వహించడం పట్ల నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.  నిబంధనలు సామాన్యులకు మాత్రమేనా? సంపన్నులకు లేదా భారీ విరాళాలు ఇచ్చే వ్యక్తులకు నియమాలు లేవా? అంటూ నిలదీస్తున్నారు.  శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంపన్నులకు ఎందుకు నిబంధనలు అమలు చేయడం లేదు? గర్భగుడిలోని బంగారు పొరలను ఇత్తడిగా మార్చడంపై ఇటీవల ఓ పూజారి వాంగ్మూలం ఇచ్చారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా ధామంలో వేసిన బంగారు పొరలు ఇత్తడిలా మారాయని ఆ పూజారి చెప్పారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దుమారం రేగింది.

ఆలయ కమిటీ లేఖ  

ఈ విషయమై అధికారులను వివరణ కోరినట్లు శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ లేఖ విడుదల చేశారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రుద్రప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో మాట్లాడి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గర్భగుడిలో బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన దాత చేతివృత్తిదారులను పంపి పనులు ప్రారంభించారు. ఈ ఎపిసోడ్‌పై విచారణ జరపాలని తీర్థయాత్ర పూజారులు అంటున్నారు. మొత్తమ్మీద, కేదార్‌నాథ్ ఆలయంపై తలెత్తిన వివాదాల కారణంగా రాజకీయ ఉత్కంఠ పెరిగింది.

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?