యువతి ప్రాణం తీసిన సోషల్ మీడియా పోస్టు... కిరోసిన్ పోసి, నిప్పంటించి..

Published : Jun 11, 2021, 12:29 PM IST
యువతి ప్రాణం తీసిన సోషల్ మీడియా పోస్టు... కిరోసిన్ పోసి, నిప్పంటించి..

సారాంశం

సోషల్ మీడియా పోస్ట్ మీద చెలరేగిన వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సోషల్ మీడియా పోస్ట్ మీద చెలరేగిన వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

మృతురాలు అతిరా(28)గా గుర్తించారు. ఈ ఘటనలో ఆమె కాలిన గాయాలకు చికిత్స పొందుతూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మరణించింది. సోషల్ మీడియా పోస్టుపై లివిన్ రిలేషన్ లో ఉన్న తన భాగస్వామికి తనకు మధ్య వచ్చిన విబేధాలతో అతను ఆమెకు నిప్పంటించాడు.

ఈ మంటల్లో యువతి భాగస్వామి షానవాజ్ (30) కూడా గాయపడి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. తిరువనంతపురం నుండి ఓ గంట దూరంలో ఉన్న కొల్లాం లోని అంచల్ లో ఈ సంఘటన జరిగింది.

వీరిద్దరి మధ్య ఓ సోషల్ మీడియా పోస్ట్‌పై విభేదాలు తలెత్తాయని పోలీసులు చెబుతున్నారు. "అతిరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోపై ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. దీంతో షానావాజ్ ఆమెపై కిరోసిన్ పోసి లైటర్‌తో నిప్పంటించాడని అతిరా తల్లి ఆరోపించారు. ఈ దంపతులకు మూడు నెలల చిన్నారి కూడా ఉంది" అని అంచల్ స్టేషన్ పోలీసు అధికారి సైజు నాథ్ తెలిపారు.  

భర్తతో గొడవ.. ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కిందపడి.....

మంటల బాధ తాళలేక అతిరా పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో విషయం బయటపడింది. వారు వెంటనే అంబులెన్స్ ను దంపతులను మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు.

ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ అతిరా గురువారం ఆసుపత్రిలో మరణించింది. ఈ మేరకు షానావాజ్‌పై హత్య కేసు నమోదైంది. అతిరా తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !