కలెక్టర్ రోహిణి సింధూరి కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆందోళన

Published : Jun 11, 2021, 10:04 AM ISTUpdated : Jun 11, 2021, 10:07 AM IST
కలెక్టర్ రోహిణి సింధూరి కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆందోళన

సారాంశం

తన ఆస్తి ఏదైనా గానీ అక్రమమని తేలితే.. వాటిని గవర్నర్ పేరిట రాసిస్తానని ఆయన సవాల్ చేశారు. అదే సక్రమమని తేలితే.. రోహిణి సింధూరి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు.

మైసూరులోని దట్టగళ్లిలోని తమ కన్వెన్షన్ హాల్ అక్రమంగా నిర్మించారని గత కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు. గురువారం కేఆర్ నగర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే సా.రా మహేష్ ఆందోళన చేపట్టారు.

ప్రాంతీయ కమిషనర్ ఆఫీసు ఆవరణలో  ఒంటరిగా కాసేపు బైఠాయించారు. తన ఆస్తి ఏదైనా గానీ అక్రమమని తేలితే.. వాటిని గవర్నర్ పేరిట రాసిస్తానని ఆయన సవాల్ చేశారు. అదే సక్రమమని తేలితే.. రోహిణి సింధూరి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు.

మరోవైపు జిల్లా చుట్టుపక్కల జరిగిన భూకుంభకోణాలపై దర్యాప్తునకు ఐఏఎస్‌ రోహిణి సింధూరిని నియమించాలని ఎమ్మెల్సీ హెచ్‌.విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ భూకుంభకోణంపై ఆమెకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.  అయితే, ఇద్దరు ఐఏఎస్​ల మధ్య రగడ తారా స్థాయికి చేరడంతో సీఎం యడియురప్ప రోహిణి సింధూరిని, కమిషనర్ శి​ల్పానాగ్​లను  వేర్వేరు శాఖలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?