భార్య అక్రమ సంబంధం... భర్త విడాకులు తీసుకోవచ్చు... కోర్టు తీర్పు

By telugu teamFirst Published Sep 20, 2019, 11:50 AM IST
Highlights

గుడ్ గావ్ కి చెందిన ఓ యువకుడికి 2014లో వివాహం జరిగింది.పెళ్లి జరిగిన నాటి నుంచి అతనితో భార్య సరిగా మెలగడం లేదు. వాళ్లు హనీమూన్ కి వెళ్లిన సమయంలో... ఆమె కనీసం అతనితో చనువుగా మెలిగింది లేదు. వేరే వ్యక్తి మోజులో పడి భర్తను, అతని కుటుంబసభ్యులను తన చేతలతో, మాటలతో హింసించేది. ఇక ఆమెను భరించలేక అతను భార్యతో చట్టబద్ధంగా విడిపోవాలని భావించాడు. దీంతో... గుడ్ గావ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

భార్య... పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం... భర్తను మానసికంగా హింసించడంతో సమానమని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. మహిళ... పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే... ఈ కారణం చూపించి భర్త విడాకులు తీసుకునే అవకాశం ఉందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుడ్ గావ్ కి చెందిన ఓ యువకుడికి 2014లో వివాహం జరిగింది.పెళ్లి జరిగిన నాటి నుంచి అతనితో భార్య సరిగా మెలగడం లేదు. వాళ్లు హనీమూన్ కి వెళ్లిన సమయంలో... ఆమె కనీసం అతనితో చనువుగా మెలిగింది లేదు. వేరే వ్యక్తి మోజులో పడి భర్తను, అతని కుటుంబసభ్యులను తన చేతలతో, మాటలతో హింసించేది. ఇక ఆమెను భరించలేక అతను భార్యతో చట్టబద్ధంగా విడిపోవాలని భావించాడు. దీంతో... గుడ్ గావ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

అయితే... భర్త విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడాన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని... తమ నాలుగేళ్ల కాపురంలో జరిగిన పరిస్థితులను ఆ వ్యక్తి న్యాయస్థానానికి వివరించాడు. తన భార్య ప్రియుడికి చేసిన మెసేజ్ లు, మెయిల్స్ ని ఆధారాలుగా చూపించాడు.  సదరు మహిళ మాత్రం విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తూనే ఉంటాయని... వాటిని పరిష్కరించుకుంటే సరిపోతుందని.. ఆ మాత్రానికే విడాకులు ఇవ్వడం సరికాదని పేర్కొంది.

 అయితే... న్యాయస్థానం మాత్రం సదరు మహిళదే తప్పని తేల్చిచెప్పింది. భార్య మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది... భర్తకు మానసికంగా హిసించడంతో సమానమని తేల్చిచెప్పింది. అలాంటి పరిస్థితుల్లో భర్త విడాకులు తీసుకునే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.

click me!