దారుణం.. నగ్నంగా మహిళ మృతదేహం

Published : Apr 10, 2019, 10:22 AM IST
దారుణం.. నగ్నంగా మహిళ మృతదేహం

సారాంశం

తల లేకుండా.. నగ్నంగా ఓ మహిళ మృతదేహం కనిపించిన సంఘటన ముంబయిలోని వాసాయ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ దృశ్యం కనపడింది.  

తల లేకుండా.. నగ్నంగా ఓ మహిళ మృతదేహం కనిపించిన సంఘటన ముంబయిలోని వాసాయ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ దృశ్యం కనపడింది.  మహిళను అతి దారుణంగా హత్య చేసి.. తల లేకుండా మిగిలిన శరీరాన్ని సమీపంలోని ఓ నదిలో పడేశారు. ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు తల లేకుండా చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళ వయసు 20 ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె కుడి చేతికి ఎరుపు రంగు దారం ఒకటి ఉంది. ఆమె శరీరాన్ని నదిలో పడేసిని కొద్ది గంటల్లోనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఆమె ఎవరు? హత్య ఎవరు చేశారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వారు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?