దారుణం..తొమ్మిదేళ్ల బాలుడిపై మహిళ అత్యాచారం

Published : Feb 11, 2019, 11:06 AM IST
దారుణం..తొమ్మిదేళ్ల బాలుడిపై మహిళ అత్యాచారం

సారాంశం

తొమ్మిదేళ్ల బాలుడిపై 36ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేరళలో కలకలం రేపింది. సమీప బంధువే.. బాలుడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం.

తొమ్మిదేళ్ల బాలుడిపై 36ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేరళలో కలకలం రేపింది. సమీప బంధువే.. బాలుడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్లాప్పురం పట్టణం తెన్హిపాలెంకు చెందిన 9ఏళ్ల బాలుడిపై అతని సమీప బంధువు అయిన 36ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. కాగా.. బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

కాగా.. బాలుడికి చికిత్స అందించిన డాక్టర్లు వెంటనే ఛైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా మహిళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోందని.. దీంతో బాలుడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వారు ఆరోపిస్తున్నారు. చైల్డ్ లైన్ అధికారుల సహాయంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. అయితే.. రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల కారణంగా తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మహిళ పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ విషయంలో నిజానిజాలు తేల్చే పనిలో పడినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే