
Odisha : సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దంపతుల మధ్య మొదలైన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఓ తాంత్రికుడు.. ఓ మహిళను బంధించి... ఆమె మైనర్ కొడుకు ముందరే 79 రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు బాధితురాలు, తన రెండేండ్ల కుమారుడు ఆ మాంత్రికుడి నుంచి తప్పించుకున్నారు. పోలీసు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బాలాసోర్ లో నివాసముంటున్న ఓ జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. కొన్ని రోజుల వరకు వీరి కాపురం బాగానే సాగింది. కొద్ది రోజుల తర్వాత అత్తమామల నుంచి వరకట్న వేధింపులు షూరు అయ్యాయి. భర్త కూడా ఆమై హింసకు పాల్పడుతుండటం పెరిగింది. ఈ వివాదాలు మరింత పెరుగుతుండటంతో సదరు మహిళను ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే, ఈ క్రమంలో ఆ తాంత్రికుడు వారికి మాయమాటలు చెప్పాడు. ఆమెకు దోషాలు ఉన్నాయని వారిని భయపెట్టాడు. వాటిని తగ్గించడానికి సదరు మహిళను ఇక్కడే కొన్ని రోజులు ఉంచాలని చెప్పాడు. దీనికి మహిళ నిరాకరించింది. తన రెండేండ్ల కుమారుడితో ఇక్కడ ఉండలేనని చెప్పింది.
ఆమె మాటలను పట్టించుకొని అత్తమామలు, భర్త.. మహిళను అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఆమె అక్కడే ఉంచడానికి ఆమె తినే ఆహారంలో తెలియకుండా మత్తుమందు కలిపి పెట్టారు. బాధిత మహిళ సృహ తప్పి పడిపోయాక ఆమెను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. వారికి కావాల్సిన ఆహరాన్ని చాటుగా అందించి వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా బాధిత మహిళ ఆ తాంత్రికుడు ఉండే ప్రాంతంలోనే ఉంటోంది. అయితే, ఆ తాంత్రికుడు బాధిత మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఒక గదిలో బంధించాడు. నిత్యం బాధిత మహిళను తన రెండేండ్ల కుమారుడి ముందరే.. 79 రోజులుగా లైంగికదాడి చేస్తున్నాడు. ఎట్టకేలకు బాధితురాలు ఆ మాంత్రికుడి నుంచి తప్పించుకుని బయటపడింది.
జరిగిన దారుణం గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. తాంత్రికుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా తప్పించుకున్నాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతి తన బావతో కలిసి బైక్ పై గురువారం రాత్రి రాంపురా అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తోంది. అయితే ఈ సమయంలో నలుగురు దుండగులు వారి బైక్ ను అడ్డగించారు. ఆమె బావను తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆ యువతిని అడవిలోకి ఈడ్చుకెళ్లారు. అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండగా మరో ఇద్దరు యువకులు మేజర్లు ఉన్నారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో యువతి బావ సహాయం కోసం అభ్యర్థించారు. అయితే అదే సమయంలో అటు నుంచి ఓ బాట సారుడు రావడంతో అతడి సాయంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు.