వైరల్ స్టోరీ: కుక్క కోసం భర్త బలి.. మొగుడ్ని దత్తతకు పెట్టిన సతీమణి.. వైరల్ అవుతున్న మెసేజీ ఇదే

Published : Feb 25, 2023, 03:30 PM IST
వైరల్ స్టోరీ: కుక్క కోసం భర్త బలి.. మొగుడ్ని దత్తతకు పెట్టిన సతీమణి.. వైరల్ అవుతున్న మెసేజీ ఇదే

సారాంశం

ఓ మహిళ తన భర్తకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఓ కుక్క పిల్ల కొనుక్కువచ్చింది. కానీ, కుక్కలంటే భర్తకు ఇష్టం ఉండదనే విషయం తెలుసుకుని దత్తతకు ఇవ్వాలనుకున్నట్టు రాసిన ఓ మెస్సేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే, దత్తత పెట్టింది కుక్క కూనను కాదు.. భర్తను అని ఆ మెస్సేజీలో ఉంది. ఈ మెస్సేజీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ యాడ్ లాంటి మెస్సేజీ వైరల్ అవుతున్నది. భర్తకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అతని భార్య ఓ కుక్కను కొనుక్కువచ్చింది. కానీ, ఆ తర్వాత తన భర్తకు కుక్కలంటే అలర్జీ అని తెలుసుకుంది. ఏం చేయాలా? అనే సందిగ్ధంలో పడింది. కుక్కను వదులుకోలేకపోయింది. అందుకు ఏకంగా భర్తనే వదిలించుకోవాలని అనుకుంది. అందుకే కుక్క కోసం భర్తను దత్తతకు పెట్టింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉన్నదనేది పక్కన పెడితే.. ఈ మెస్సేజీ మాత్రం తెగ వైరల్ అవుతున్నది.

ఓ ఇల్లు తక్షణమే కావాలి అనే టైటిల్‌తో ఈ మెస్సేజీ వాట్సాప్, ట్విట్టర్‌లలో హల్‌చల్ చేస్తున్నది. ఇంతకీ ఆ మెస్సేజీలో ఏముందో ఓ సారి చూద్దాం. ఆ మెస్సేజీని సొనాలి అనే మహిళ ఫ్రెండ్ రాసినట్టు ఉన్నది. 

‘ఒక ఇల్లు తక్షణమే కావాలి. ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే.. దీని పేరు లియో. రెండు నెలల జర్మన్ షెఫర్డ్ జాతి శునకం. నా ఫ్రెండ్ సొనాలి దీన్ని రూ. 20 వేలు పెట్టి కొనుగోలు చేసింది. తన భర్తకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంది. కానీ, తన భర్త గౌరవ్‌కు కుక్కలంటే పడదని ఆ తర్వాత తెలుసుకుంది. సోనాలి ఇప్పుడు దత్తత ఇవ్వడానికి చూస్తున్నది. ఎవరికైనా ఆసక్తి ఉంటే.. *గౌరవ్ వయసు 29 ఏళ్లు*, బైక్ నడపగలడు, వంట కూడా చేయగలడు, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ అందగాడే’ అని ఆ మెస్సేజీ రాసి ఉన్నది.

ఈ మెస్సేజీకి తోడుగా ఆ కుక్క పిల్ల ఫొటోనూ జత చేశారు.

Also Read: దావూద్ ఇబ్రహీం డీ కంపెనీపై ఎన్‌ఐఏ టార్గెట్.. దుబాయ్‌కు వెళ్లిన టీమ్

ఈ మెస్సేజీపై ట్విట్టర్‌లో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఫస్టు ఆ కుక్కను దత్తతకు ఇస్తున్నారేమో అనుకున్నా.. భర్తనే దత్తతకు పెట్టారా? అంటూ ఓ యూజర్ ఆశ్చర్యపోయాడు. మరొకరు మనిషి కంటే కుక్కకే ఎక్కువ విలువ ఉన్నదని నిరూపితమైందని, పాపం ఆ భర్త అంటూ వాపోయాడు. ఇంకొకరు పెళ్లి తర్వాత కుక్కలాంటి పరిస్థితి ఏర్పడుతుందని విన్నా.. కానీ, ఇక్కడ అంతకు మించిన వెర్షన్ నడుస్తున్నది అని కామెంట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం