ఢిల్లీలో దారుణం.. కోడలిని టెర్రస్ పైనుంచి తోసేసిన అత్తామామలు.. పోలీసులపై మహిళా కమీషన్ సీరియస్...

Published : Jun 20, 2022, 12:31 PM IST
ఢిల్లీలో దారుణం.. కోడలిని టెర్రస్ పైనుంచి తోసేసిన అత్తామామలు.. పోలీసులపై మహిళా కమీషన్ సీరియస్...

సారాంశం

కోడల్ని అత్తామామలు టెర్రస్ మీదినుంచి తోసేశారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 

ఢిల్లీ : దేశ రాజధాని delhiలో దారుణం చోటుచేసుకుంది.  ఓ మహిళను అత్తామామలు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసేశారు. ప్రస్తుతం ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ టెర్రస్ పై నుంచి 30 ఏళ్ల మహిళ రోడ్డుపై పడింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

కాగా, తన సోదరిని అత్తింటివారు building terrace నుంచి కిందికి తోసేసినట్లు ఆమె సోదరుడు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)కు షేర్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోలో మహిళను భవనం పైనుంచి తోసేస్తున్న దృశ్యం ఉన్నట్లు సమాచారం. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుపై డిసిడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు.
 
ఈ విషయమై పోలీసులకు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తామని డిసిడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ను ఆదేశించారు. కాగా,  ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రియాంక కశ్యప్ పేర్కొన్నారు.  బాధిత మహిళల అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

పోలీసులకు బ్లాంక్ చెక్ లు, స్మగ్లర్లు ఇచ్చినదానికంటే ఎక్కువే ఇస్తానంటూ ట్వీట్.. వ్యక్తి అరెస్ట్..

కాగా, Delhiకి చెందిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన భార్యను Murder చేసి శవాన్ని ఇంట్లోని bathroomలో దాచాడు. ఢిల్లీలోని కపిల్ విహార్‌కు చెందిన విజయ్ (38) జూన్ 18న తన భార్యను హత్య చేసినట్లు భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌లో అధికారులకు సమాచారం అందించాడు. విచారణ అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు సంతోషిదేవిని భర్త గుడ్డలో చుట్టి ఉంచినట్లు గుర్తించారు.

వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్‌కి ఇంతకు ముందు మరో మహిళతో వివాహం జరిగిందని, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారని అధికారులు గుర్తించారు. అనంతరం ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇది తెలిసిన వెంటనే, అతని మొదటి భార్య అతని నుండి విడిపోయింది. మృతురాలు సంతోషికి నలుగురు పిల్లలు, 14, 13, 12 ఏళ్ల ముగ్గురు అమ్మాయిలు, 8 ఏళ్ల అబ్బాయి ఉన్నారు. ఆమె కూడా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.

దీంతో భార్య విడిపోవడంతో విజయ్, సంతోషి సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. కాలక్రమేణా, పిల్లలందరి సంరక్షణకు సంబంధించిన విషయంలో విజయ్, సంతోషి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. జూన్ 17 సాయంత్రం, సంతోషి పని నుండి తిరిగి వచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో, మళ్లీ గొడవ జరిగింది. పిల్లలందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రపోతున్నారు. విజయ్, సంతోషి పై అంతస్తులో ఉన్నారు.

గొడవ ఎంతకీ ముగింపుకు రాకపోవడం.. పదే పదే గొడవలు రిపీట్ అవుతుండడంతో నిందితుడు కోపంతో సంతోషిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎక్కడైనా మాయం చేయాలనుకున్నాడు. దీనికోసం మృతదేహాన్ని గుడ్డలో చుట్టాడు. ఆ తరువాత ఎవ్వరూ చూడకుండా పారవేద్దామనుకున్నాడు. కానీ, అతను ఆ పని చేయలేకపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. జూన్ 18 రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించాడు. తన నేరాన్ని అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?