
గురుగ్రామ్ : చౌదరి సత్ ప్రకాష్ నైన్ అనే వ్యక్తి gurugam policeలకు blank chequesలను ఇచ్చాడు. ఆవుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేయడానికి ఇలా చేశాడట. ‘నన్ను చంపేందుకు స్మగ్లర్లు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పండి.. వాళ్ల కంటే నేను ఎక్కువే ఇస్తాను’ అంటూ tweet కూడా చేశాడు. దీంతో పోలీసులు అతని మీద ఫైర్ అయ్యారు.
ఆ బ్లాంక్ చెక్కులు ఇచ్చిన వ్యక్తి మీద ఇంతకుముందు క్రిమినల్ కేసులు ఉన్నాయని వాటితో పాటు.. ఇప్పుడు ఈ ట్వీట్ చేసినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మే 1 రాత్రి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి శివారులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనంలో తరలిస్తున్న ఆవులు సజీవదహనం అయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెడితే... కొందరు వ్యక్తులు అంబులెన్స్ అని స్టిక్కర్ ఉన్న టెంపో వాహనంలో ఆవులను తరలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ మాక్లూర్ తండా సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి పరారయ్యాడు.
Agnipath Protests : 35 వాట్సప్ గ్రూపులపై నిషేధం... కేంద్రం కీలక నిర్ణయం..
వాహనంలో ఉన్నవారిని కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డుపై వెళ్లేవారు అద్దాలు పగలగొట్టారు. అయితే అప్పటికే అందులో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 13 ఆవులు సజీవ దహనం అయ్యాయి. వాటిలో కొన్ని మంటలు అంటుకుని మరణించగా.. మరికొన్ని ఊపిరాడక చనిపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిజామాబాద్ ఏసీపీ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లు ఆవులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబులెన్స్ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఆవులను తరలిస్తున్న అంబులెన్స్‌లో ఉన్న సిలిండర్ లీక్ కావడం వల్లే మంటలు చెలరేగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.