లిఫ్ట్ లో ఒంటరిగా ఉందని అసభ్యంగా తాకాడు.. యువతి ఏం చేసిందంటే..!

Published : Oct 02, 2023, 08:59 AM IST
లిఫ్ట్ లో ఒంటరిగా ఉందని అసభ్యంగా తాకాడు.. యువతి ఏం చేసిందంటే..!

సారాంశం

యువతి ఒంటరిగా కనిపించడంతో తనలోని వక్ర బుద్ధిని బయటపెట్టాలని చూశాడు. ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు.

మహిళలు ఒంటరిగా కనపడితే చాలు, వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి కామాంధుల నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా ఓ యువతిని వేధించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. చివరు ఆ యువతి అతనికి బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం, ఓ యువతి లిఫ్ట్ లో ఉంది. తాను వెళ్లాల్సిన ఫ్లోర్ కి వెళ్లడానికి సమయం ఉండటంతో, ఆమె ఫోన్ చూస్తోంది. ఆ సమయంలో ఆ లిఫ్ట్ లోకి మరో వ్యక్తి వచ్చాడు. లోపలికి రాగానే, యువతి ఒంటరిగా కనిపించడంతో తనలోని వక్ర బుద్ధిని బయటపెట్టాలని చూశాడు. ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు.

 

మొదట తాకినప్పుడు యువతి భయపడి పక్కకు జరిగింది. భయపడింది కదా అని మరోసారి తాకాలని చూశాడు. అంతే, ఆ యువతి విశ్వరూపం చూపించింది. అతనిని ఇష్టం వచ్చినట్లు ఉతికేసింది. కిందపడిన తర్వాత అతనిని కొట్టరాని చోట కూడా కాలితో తన్నింది. అంతే, ఆ యువతి నుంచి అలాంటి అటాక్ ఊహించని అతను కుప్పకూలిపోయాడు. ఇదంతా లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమేరాలో రికార్డు కావడం గమనార్హం.

దీంతో, ఎవరో ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది కాస్త వైరల్ గా మారింది.  నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఎదవకు చాలా మంచిగా బుద్ధి చెప్పావంటూ ఆమె ధైర్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమెను ప్రశంసిస్తూ, అతనిని తిడుతూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !