Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

Published : Oct 02, 2023, 06:33 AM IST
Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

సారాంశం

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఉజ్జయినిలో జరిగిన బాలిక అత్యాచార ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్‌ పలు విషయాలను వెల్లడించినట్లు తెలిసింది

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఉజ్జయినిలో మైనర్‌పై జరిగిన అత్యాచార ఘటన యావత్ దేశం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. మైనర్ సత్నా నివాసి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రధాన నిందితుడిగా నానాఖేడాకు చెందిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడికి గాయాలయ్యాయి. దీంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. 

ఇదిలాఉంటే.. ఆధారాలు దాచిపెట్టినందుకు ప్రధాన  నిందితుడి పాటు ఉన్న మరో ఆటోడ్రైవర్ రాకేష్ మాలవీయను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజ్జయిని అత్యాచారం కేసులో అతడి ఆటోలో రక్తపు మరకలు కనిపించడంతో అతడే ప్రధాన నిందితుడిగా భావించి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, కస్టడీలో ఉన్న ఆటో డ్రైవర్‌ రాకేశ్‌ మాలవీయ పలు విషయాలను పోలీసులకు వెల్లడించాడు. ఆ మైనర్ బాధితురాలికి తన ఖాకీ చొక్కాను ఇచ్చానని,అయితే.. ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా రోడ్డుపై వదిలేయడమే తన తప్పుఅని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. 

ఉజ్జయినిలో అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక అర్ధనగ్నంగా, రక్తస్రావంతో ఇంటింటికీ వెళ్లి సహాయం కోసం వేడుకున్న విషయం తెలిసిందే. ఆ బాలిక దయనీయమైన స్థితిని అర్థం చేసుకుని ముందుకు వచ్చని నాథుడే లేదు. అయితే.. బాలలపై లైంగిక వేధింపుల చట్టాల ప్రకారం.. సహయం చేయడానికి నిరాకరించడం నేరమేననీ, వారిపై కూడా అభియోగాలు మోపవచ్చని పోలీసులు తెలిపారు. మాలవీయను అనుమానితుడిగా భావించి తొలుత పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడు నేరం జరిగిన వెంటనే సంబంధిత ఘటనను సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.  

ఉజ్జయినిలో అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడిగా రాకేష్ మాల్వియా అరెస్టు చేశారు. వాస్తవానికి బాధిత బాలికను ఆటోలో కూర్చోబెట్టి, తన చొక్కా బాధితురాలికి ఇచ్చాడు. అయితే, అతను బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ కారణంగా.. అతడు నాలుగు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. అతనిపై బెయిలబుల్ సెక్షన్లు కూడా విధించబడ్డాయి. ఇప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు బాలిక సాయం కోరినా ఉజ్జయిని వాసులు ఆమెను ఛీత్కరించుకోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అత్యాచారం జరిగిన రెండు గంటల తర్వాత.. బాధిత బాలిక వందలాది ఇళ్లు, దాబాలు, టోల్ బూత్‌ల మీదుగా వెళ్లినా ఎవరూ సాయం చేయలేదు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలో బాలిక ప్రత్యేకంగా ఇంటి వెలుపల నిలబడి ఉన్న వ్యక్తిని సహాయం కోరుతూ కనిపించింది. అయితే ఆ వ్యక్తి బాధితురాలిపై దుర్భాషలాడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి ఓ ఆలయ పూజారి ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు భరత్ సోనీ జైలులో ఉన్నాడు. బాలిక ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood