ప్రియుడిపై మోజు: పిల్లలను చంపేసి ఆ తల్లి ఏం చేసిందంటే..

By pratap reddyFirst Published 2, Sep 2018, 8:36 AM IST
Highlights

ప్రియుడి మోజులో ఓ మహిళ అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడింది. భర్తను, ఇద్దరు బిడ్డలను చంపాలని చూసింది. కానీ, అది కుదరకపోవడంతో విషం ఇచ్చి ఇద్దరు పిల్లలను చంపేసి ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించింది. 

చెన్నై: ప్రియుడి మోజులో ఓ మహిళ అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడింది. భర్తను, ఇద్దరు బిడ్డలను చంపాలని చూసింది. కానీ, అది కుదరకపోవడంతో విషం ఇచ్చి ఇద్దరు పిల్లలను చంపేసి ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించింది. 

పల్లావరం సమీపంలోని కుండ్రత్తూర్‌కి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి విజయ్‌(34), అభిరామి(28) దంపతులకు అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కూతురు ఉన్నారు. అదే ప్రాంతంలోని ఓ బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

తనకు విషయం తెలిసి విజయ్‌భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. నెలలో చివరి రోజు కావడంతో శుక్రవారం బ్యాంక్‌లో పని అధికంగా ఉంటుందని, ఆలస్యంగా వస్తానని భార్యతో చెప్పి విజయ్‌ వెళ్లాడు. 

రాత్రి ఇంటికి వచ్చిన అతనికి ఇంటి తలుపులు మూసివుండడం, ఇంట్లో లైట్లు వెలుగుతుండడం కనిపించింది. తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూసి షాక్ తిన్నాడు.
 
ఇద్దరు పిల్లలూ నురుగులు కక్కుకొని పడి ఉన్నారు.  బోరున విలపిస్తూ భార్య కోసం గాలించాడు. కానీ ఆమె కనిపించలేదు. దాంతో కుండ్రత్తూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితో వెళ్లాలనుకున్న అభిరామి పాలలో విషం కలిపి పిల్లలకు ఇచ్చి హత్య చేసిందని విచారణలో పోలీసులు నిర్ధారించారు. గాలింపు చర్యలు చేపట్టి సుందరాన్ని అరెస్ట్‌ చేశారు. 

పాలు తాగి బాధతో పిల్లలు కేకలు వేస్తున్న సమయంలో సుందరం తన మోటార్‌బైక్‌పై అభిరామిని కోయంబేడు బస్టాండుకు తీసుకెళ్లి నాగర్‌కోయిల్‌ బస్సు ఎక్కించాడు. నిజానికి రోజూలాగే ముందుగానే ఇంటికి వస్తే పిల్లలతోపాటు భర్తను కూడా చంపాలని అభిరామి నిర్ణయించుకుందని పోలీసులు అంటున్నారు. సుందరం ఇచ్చిన సమాచారంతో అభిరామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Last Updated 9, Sep 2018, 11:23 AM IST