
గాంధీనగర్ : ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే దానికి ఓ ముద్దు పేరు పెట్టి.. పదే పదే దాన్ని ఆ పేరుతో పిలుస్తూ మురిసిపోతాం. ఇంకా కొంతమంది తమకిష్టంలేని వ్యక్తి పేరు శునకాలకు పెట్టి వాటిని పిలుస్తూ కసి తీర్చుకుంటారు.. ఓ సినిమాలో అలాగే తన కుక్కకు తనను సతాయించే బాస్ పేరు పెట్టి కామెడీ సృష్టిస్తాడు హీరో. అదంతా వినడానికి, నవ్వుకోవడానికి బాగుంటుంది. అయితే శునకానికి పెట్టిన పేరు ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపడానికి దారి తీస్తే... తాను పెట్టిన పేరే తన పాలిట మృత్యువుగా మారితే.. ఊహించడమే కష్టంగా ఉంది కదా.. కానీ అచ్చం అలాంటి సంఘటనే గుజరాత్ లో జరింది.
వివరాల్లోకి వెడితే... తను ప్రేమగా పెంచుకున్న శునకానికి ‘సోను’ అని పేరు పెట్టడమే ఆ మహిళలకు శాపంగా మారింది. ఆ పేరు పెడతావా.. అంటూ పొరుగింటి వారు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భావ్ నగర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన నీతా బెన్ సర్వాయియా (35) తాను పెంచుకుంటున్న Pet Dogకి ‘సోను’ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయంపై ఆగ్రహించిన Neighbours.. మంగళవారం నీతా బెన్ ఒంటరిగా ఉండటాన్ని గమనించి వారింట్లోకి చొరబడ్డారు.
తన భార్య ముద్దు పేరు ‘Sonu’ అని.. ఆ పేరు కుక్కకు ఎలా పెడతారు? అని సురాభాయ్ భర్వాద్ అనే పొరుగింటి వ్యక్తిని నీతాబెన్ తో వాగ్వాదానికి దిగాడు. ఆమె kitchenలోకి వెళ్లగానే వెంబడించిన ముగ్గురు వ్యక్తులు.. అక్కడున్న Kerosene డబ్బాను తీసుకుని ఆమెపై పోసి నిప్పంటించారు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఆమె కేకలతో ఇంట్లోకి వచ్చిన స్థానికులు.. మంటలను ఆర్పి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో భావ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
భర్త ఇద్దరు పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించారని, తనని దుర్భాషలాడారని సదరు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తాను వంటింట్లోకి వెళ్లగానే అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన పోసి నిప్పు అంటించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ కుటుంబాలకు పలు వివాదాలు జరిగినట్లు గుర్తించారు.
అయితే, ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం కావాలనే శునకానికి ఆ పేరు పెట్టారా? అని సంఘటన, వారి మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వీరు కావాలని చేసినా, చిన్న విషయానికి ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసేంత కృరత్వం ఏంటని మరికొందరు అంటున్నారు.