మూకదాడికి వ్యతిరేకంగా బిల్లు పాస్.. దోషులకు యావజ్జీవ ఖైదు.. బీజేపీ మండిపాటు

Published : Dec 22, 2021, 12:58 AM ISTUpdated : Dec 22, 2021, 01:01 AM IST
మూకదాడికి వ్యతిరేకంగా బిల్లు పాస్.. దోషులకు యావజ్జీవ ఖైదు.. బీజేపీ మండిపాటు

సారాంశం

మూక దాడులకు వ్యతిరేకంగా మరో రాష్ట్రంలోనూ బిల్లు పాస్ అయింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌లూ మూకదాడి వ్యతిరేక చట్టాలను తెచ్చాయి. తాజాగా, జార్ఖండ్ అసెంబ్లీ మూక దాడి వ్యతిరేక బిల్లును ఆమోదించింది. మూక దాడి దోషులకు మూడేళ్ల నుంచి యావజ్జీవిత కారాగార శిక్ష విధించడానికి ఈ బిల్లు ఉపకరించనుంది. చట్టరూపం దాల్చడానికి బిల్లును త్వరలోనే గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.  

రాంచీ: రెండేళ్ల క్రితం 2019లో తబ్రేజ్ అన్సారీ(Tabrez Ansari)ని పోల్‌కు కట్టేసి ఓ మూక చేసిన దాష్టీకం దేశవ్యాప్తంగా ఆందోళనలు రగిల్చింది. తనను వదలిపెట్టాలని తబ్రేజ్ అన్సారీ దీనంగా వేడుకున్నా ఆ మూక మరింత వెర్రితనంతో దాడి చేసింది. ఈ దాడి తర్వాత హాస్పిటల్‌తో చికిత్స పొందుతూ తబ్రేజ్ అన్సారీ మరణించాడు. అప్పటి నుంచి దేశమంతటా మూక దాడి(Mob Lynching) అంశంపై తీవ్ర చర్చ జరిగింది. హేమత్ సోరెన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మూక దాడికి వ్యతిరేకంగా చట్టం తెస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అదే సమయంలో హామీ ఇచ్చారు. తాజాగా, జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీలో యాంటీ మాబ్ లించింగ్ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై బీజేపీ మండిపడింది. ఎన్నో సవరణలు సూచించింది. కానీ, వాటన్నింటినీ అధికార పక్షం మూజువాణి ఓటింగ్ ద్వారా తిరస్కరించగలిగింది.

మూక దాడికి వ్యతిరేకంగా చట్టాన్ని ఇది వరకే రెండు రాష్ట్రాలు తెచ్చాయి. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు మూక దాడికి వ్యతిరేకంగా ఇది వరకే చట్టాలను తెచ్చాయి. తాజాగా, ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్రం కూడా చేరింది. ప్రతిపక్షం బీజేపీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినా.. హేమంత్ సోరెన్ ప్రభుత్వం సులువుగానే ఈ బిల్లును ఆమోదించుకుంది. మూజువాణి ద్వారా ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది.

Also Read: Rahul Gandhi: మోడీ స‌ర్కారు ఏర్ప‌డ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

ఈ బిల్లు ప్రకారం మూకదాడికి పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి గరిష్టంగా జీవిత ఖైదు కూడా పడుతుంది. వీటితోపాటు జరిమానాలు, ఆస్తి అటాచ్‌మెంట్లకూ అవకాశం ఉంది. అంతేకాదు, మూకదాడికి ప్రేరేపించే లేదా.. బాధ్యతారాహిత్య ధోరణిలో సమాచారాన్ని షేర్ చేసేవారినీ శిక్షించడానికి ఈ బిల్లు అనుమతి ఇస్తున్నది. ఉద్రిక్త వాతావరణానికి కారకులయ్యే వారికీ జరిమానాలు, కారాగార శిక్షలను ఈ బిల్లు అనుమతి ఇస్తుంది. బాధితుల కుటుంబాలపై బెదిరింపులు, వారికి సహాయంగా నిలిచేవారిపైనా బెదిరింపులకు పాల్పడే వారినీ ఈ బిల్లు శిక్షించనుంది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇది చట్టరూపం దాల్చడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

ప్రజలను సమర్థంగా రక్షించే లక్ష్యంతో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు జార్ఖండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆలంగీర్ ఆలం అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాపాడటానికి, మూక దాడులను నివారించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని వివరించారు. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ అనేక సవరణలు సూచించింది. కానీ, అధికారపక్షం మూజువాణి ద్వారా ఆ సవరణలను తప్పించగలిగింది. ఈ బిల్లును కేవలం మైనార్టీలను సంతుష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రవేశపెట్టిందని బీజేపీ నేత సీపీ సింగ్ ఆరోపణలు చేశారు.

Also Read: Pakistan: పాకిస్తాన్ సిగ్గు పడాల్సిన రోజు.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హ‌త్య‌ల ఘ‌ట‌న‌ల గురించి  అస‌లు వినేవారం కాద‌ని  రాహుల్ గాంధీ ఇటీవలే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు కేంద్రంలో  కొలువుదిరిన తర్వాత  ఇప్పుడు నిత్యం మూక‌దాడులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న మోడీ స‌ర్కారు అధికారంలోకి రాక‌ముందు మూక‌దాడులు గురించి విన‌లేద‌ని.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు, మూక‌దాడుల‌ను ఎత్తి చూపుతూ.  థ్యాంక్యూ మోడీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. 2014కి ముందు 'లించింగ్' అనే పదం  వినిపించేద‌ని కాద‌నీ,  ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్