బండరాళ్లతో మోది యువతి హత్య

Published : Apr 21, 2019, 11:29 AM IST
బండరాళ్లతో మోది యువతి హత్య

సారాంశం

సూలగిరి అటవీ  ప్రాంతంలో  ఓ యువతిని అత్యంత దారుణంగా  హత్య చేశారు.  మృతదేహంపై బండరాళ్లు వేసి హత్య చేశారు. మృతదేహాం ఆనవాళ్లు బయటకు రాకుండా ఉండేందుకు దుండగులు ఈ పనికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.

క్రిష్ణగిరి: సూలగిరి అటవీ  ప్రాంతంలో  ఓ యువతిని అత్యంత దారుణంగా  హత్య చేశారు.  మృతదేహంపై బండరాళ్లు వేసి హత్య చేశారు. మృతదేహాం ఆనవాళ్లు బయటకు రాకుండా ఉండేందుకు దుండగులు ఈ పనికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూలగిరి తాలుకా మేలుమలై సమీపంలోని బాలకొండరాయనదుర్గం వద్ద మహిళ హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో మృతదేహం వద్ద ఉన్న స్థలాన్ని  పోలీసులు పరిశీలించారు.

సంఘటనస్థలాన్ని డీఎస్పీ మీనాక్షి ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. హతురాలి ముఖం కన్పించకుండా కొండపై ఉన్న నీటి గుంతలో వేసి తలపై బండరాళ్లు వేశారు. బండరాళ్లను తొలగించారు. మృతదేహఆన్ని  పక్కకు తీసి పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుండి 30 ఏళ్లు ఉండొచ్చని నుమానిస్తున్నారు.

మృతురాలి ఎడమ చేతికి  పచ్చబొట్టు, వేలికి ఉంగరం ఉందన్నారు. ధరించిన దుస్తులను బట్టి మృతురాలు విద్యావంతురాలని పోలీసులు అనుమానిస్తున్నారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుండగులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారా.. ఇతర కారణాలతో హత్య చేశారా అనే విషయమై ఆరా తీస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?