వివాహేతర సంబంధం :పెళ్లి చేసుకోనన్నాడని.. ప్రియుడ్ని చంపి, సూట్ కేస్ లో కుక్కి..

Published : Aug 09, 2022, 01:13 PM ISTUpdated : Aug 09, 2022, 01:20 PM IST
వివాహేతర సంబంధం :పెళ్లి చేసుకోనన్నాడని.. ప్రియుడ్ని చంపి, సూట్ కేస్ లో కుక్కి..

సారాంశం

పెళ్లి చేసుకోనన్నాడని ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హతమార్చింది. అతని మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి మాయం చేయడానికి ప్రయత్నించింది. 

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది.  ఓ మహిళ  తీసుకు వెళుతున్న ట్రాలీ సూట్ కేసు మీద అనుమానంతో పోలీసులు చెక్ చేయగా.. వారి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం బయటపడింది. ఆ సూట్కేసులో ఓ వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసి తీసుకు వెళుతుంది ఆ మహిళ.  దీంతో ఆరా తీస్తే..  పోలీసులకే  దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ పేరు ప్రీతి శర్మ. పెళ్లయింది. కానీ..  వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను వదిలేసింది. ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నా.. తనను పెళ్లి చేసుకోమని ప్రీతి శర్మ అడగడంతో రచ్చ మొదలైంది. అగ్నిసాక్షిగా  పెళ్లాడిన భర్తను వదిలేసి తనతో వచ్చేసిన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి అతను ఇష్టపడలేదు. ప్రియురాలికి కోపం నషాళానికి అంటింది. అంతే ప్రియుడిని గొంతు కోసి చంపేసింది. డెడ్ బాడీని మాయం చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. కాకపోతే ఆమె ప్లాను బెడిసికొట్టి పోలీసులకు అనుమానం రావడంతో..  అడ్డంగా దొరికిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తమదైన శైలిలో ఎంక్వైరీ మొదలుపెట్టారు.  చనిపోయి, సూట్ కేసులో విగతజీవిగా ఉన్న వ్యక్తిని సంబల్ ఏరియాకు చెందిన ఫిరోజ్ గా ఐడెంటిఫై చేశారు. ఆ మహిళ ప్రీతి శర్మ అని,  భర్తను వదిలేసి ఫిరోజ్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉంటుందని తెలిసింది, ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్ ను అడిగింది.

ప్రేమించి, సహజీవనం చేస్తున్నా కూడా.. ఫిరోజ్ ఏమనుకున్నాడో తెలియదు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది.  అతని కోసం కట్టుకున్న భర్తను కూడా వదిలేసి వచ్చింది…కానీ అతడి నిరాకరణ  ఆమెను విచక్షణ మర్చిపోయేలా చేసింది. అంతే సరైన సమయం చూసి రేజర్ తో అతని గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత డెడ్బాడీని పడేసేందుకు ఢిల్లీలోని సీలంపూర్ ఏరియాలో ఓ పెద్ద సూట్ కేస్ కొన్నది.  ఆ ట్రాలీ సూట్ కేసు లో మృతదేహాన్నిపెట్టి తీసుకు వెళుతుండగా  పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి  ఫాలో అయ్యారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 

 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu