భార్యాభర్తల వివాహేతర సంబంధాలు.. మొగుడ్ని చంపించడానికి ఏకంగా తాళిబొట్టునే తాకట్టు పెట్టి..

Published : Aug 06, 2021, 05:11 PM IST
భార్యాభర్తల వివాహేతర సంబంధాలు.. మొగుడ్ని చంపించడానికి ఏకంగా తాళిబొట్టునే తాకట్టు పెట్టి..

సారాంశం

శృతి, ప్రభాకర్ కు విడాకులు ఇచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. భర్తను విడాకులివ్వమని అడగ్గా, అతడు కూడా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో ఇవ్వనన్నాడు. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. విడాకుల విషయాన్ని శృతి తన ఫ్రెండ్ ప్రియతో చర్చించింది. 

ముంబై : భర్తను చంపించటానికి అవసరమైన డబ్బుల కోసం ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టిందో మహిళ. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బివాండికి చెందిన టాక్సీ డ్రైవర్ ప్రభాకర్, శృతి భార్యభర్తలు. శృతికి హితేష్ వాలా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. 

ఈ నేపత్యంలో శృతి, ప్రభాకర్ కు విడాకులు ఇచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. భర్తను విడాకులివ్వమని అడగ్గా, అతడు కూడా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో ఇవ్వనన్నాడు. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. విడాకుల విషయాన్ని శృతి తన ఫ్రెండ్ ప్రియతో చర్చించింది. 

ఆమె సుపారీ కిల్లర్ సంతోష్ రెడ్డిని కలవమని సలహా ఇచ్చింది. ఆ తర్వాత సంతోష్ రెడ్డితో రూ. 4 లక్షలకు డీల్ కుదిరింది. ఈ డబ్బుల కోసం శృతి బ్యాంకులో దాచుకున్న రూ. 3 లక్షలు తీసింది. మిగిలిన మొత్తం కోసం నగలను మంగళసుత్రాన్ని సైతం తాకట్టు పెట్టి, సంతోష్ రెడ్డికి ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం గ్యాంగ్ ప్లాన్ ప్రకారం ప్రభాకర్ టాక్సీని బివాండినుంచి ఏరోలికి బుక్ చేసుకుంది. 

మార్గ మధ్యలో తినడానికి అని చెప్పి కారు ఆపించింది. ఆ తరువాత ప్రభాకర్ గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేసింది. ఎక్కడా వేలి ముద్రలు పడకుండా ఆ గ్యాంగ్ జాగ్రత్త పడింది. అయితే, విచారణలో శృతి పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా అడగటంతో సుపారీ విషయం బయటపడింది. పోలీసులు సంతోష్ రెడ్డి, శృతి, ప్రియ, హితేష్ వాలాలను అరెస్ట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word