రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు: ఇక నుండి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న

Published : Aug 06, 2021, 02:59 PM IST
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు: ఇక నుండి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న

సారాంశం

క్రీడాకారులకు అందించే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును  మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న గా మార్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

న్యూఢిల్లీ: దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఇక  ఈ అవార్డును  మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.

 

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్‌ పేరు తొలగించి ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్‌ భారత హకీ దిగ్గజం. ధ్యాన్‌చంద్‌ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఖేల్‌రత్న అవార్డు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. ఈ  పురస్కారం కింద రూ. 25 లక్షల ప్రైజ్‌మనీని అందిస్తారు.


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌