భారత్‌లోకి మరో విదేశీ టీకా: కేంద్ర ప్రభుత్వానికి జాన్సన్​ అండ్​ జాన్సన్​ దరఖాస్తు

Siva Kodati |  
Published : Aug 06, 2021, 02:53 PM IST
భారత్‌లోకి మరో విదేశీ టీకా: కేంద్ర ప్రభుత్వానికి జాన్సన్​ అండ్​ జాన్సన్​ దరఖాస్తు

సారాంశం

భారత్‌లో త్వరలోనే మరో విదేశీ టీకా అడుగుపెట్టబోతోంది. తన ఏకైక డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. 

భారత్‌కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. తన ఏకైక డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ ఈరోజు వెల్లడించింది. ఆగస్టు 5న వ్యాక్సిన్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ భారత ప్రతినిధి పేర్కొన్నారు. 

భారత్ లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని గత సోమవారం జాన్సన్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని పేర్కొంది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించీ అనుమతులు కోరగా.. తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేసింది. భారతదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్ వీ లకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Asianet Exclusive : సరిహద్దులో కొత్త ఎత్తుగడలు.. చైనాకు చెక్ పెట్టేలా భారత్ ప్రోయాక్టివ్ ప్లాన్
Top 10 Least Corrupt Country : ప్రపంచంలోనే అత్యంత అవినీతి రహిత దేశం ఇదే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?