ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి డ్రామా ఆడిన భార్య

Published : Aug 14, 2018, 08:09 AM ISTUpdated : Sep 09, 2018, 12:22 PM IST
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి డ్రామా ఆడిన భార్య

సారాంశం

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకున్న ఏడాదికే భర్త అనారోగ్యం పాలయ్యాడు. దాంతో భర్తను హత్య చేసింది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.

న్యూఢిల్లీ: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకున్న ఏడాదికే భర్త అనారోగ్యం పాలయ్యాడు. దాంతో భర్తను హత్య చేసింది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ ప్రాంతానికి చెందిన వీరేందర్ పాండేతో రంజూ ఐదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి అయిన ఏడాదికే భర్త వీరేందర్ పాండే అనారోగ్యానికి గురై మంచాన పడ్డాడు. దీంతో భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించింది. 

భార్య రంజూకు హరవీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.  భర్త వైద్యం కోసం డబ్బులు చెల్లించలేక సతమతమవుతూ వచ్చింది. ఈ క్రమంలో భార్య రంజూ ప్రియుడు హరవీర్ తో కలిసి వీరేందర్ పాండేను ఇటుకతో కొట్టి చంపి, ప్రమాదవశాత్తూ గోడ కూలి మరణించాడని కథ అల్లింది.  
వీరేందర్ పాండే తలకు దెబ్బ తగిలిందని పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. గోడ కూలి భర్త వీరేందర్ మరణించాడని భార్య రంజూ చెప్పింది. అయితే ఇంట్లో గోడ కూలిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. 

దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా భార్య రంజూ  తన ప్రియుడు హరవీర్ తో కలిసి వీరేందర్ ను హత్య చేసిందని తేలింది. దీంతో నిందితులైన రంజూ, హరవీర్ లను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?