బీహార్ లో దారుణం.. చెవి నొప్పి అని హాస్పిటల్ కి వెడితే.. చేయి పోయింది.. చివరికి...

By Bukka SumabalaFirst Published Sep 2, 2022, 6:42 AM IST
Highlights

బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది. చెవినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి చేయి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. జీవితాంతం వికలాంగురాలిగా మిగిలిపోయింది. 

బీహార్ : కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత.. అచ్చం అలాగే జరిగింది ఓ యువతి విషయంలో.. వైద్యుల నిర్లక్షం కొన్నిసార్లు ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే.. జీవితాలే నాశనమవుతుంటాయి. వారు కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. వైద్యంతో కోలుకోవాల్సిన రోగులు.. విగతజీవులుగానో.. జీవచ్చవాలుగానో మారతారు. ఆ చిన్నతప్పును వారు జీవితాంతం మోయాల్సి వస్తుంది. 

పేషంట్ల కడుపులో కత్తులు, కత్తెర, దూది.. చివరికి సెల్ ఫోన్లు మరిచిపోయి ఆపరేషన్ తరువాత అలాగే కుట్లు వేయడం.. ఆ తరువాత ఎప్పటికో కడుపునొప్పితో బాధపడుతూ వారు ఆస్పత్రుల చుట్టూ తిరిగితే విషయం బయటపడడం ఘటనలు తరచుగా చూస్తూనే ఉంటాం. ఇక దివంగత హీరోయిన్ శ్రీదేవి తల్లికి కూడా విదేశాల్లో వైద్యులు తలకు ఒకవైపు చేయాల్సిన ఆపరేషన్ మరోవైపు చేయడం.. అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద వార్తగా మారింది. ఇవి వైద్యుల వల్ల జరిగే కొన్ని పొరపాట్లకు ఉదాహరణలు. ఇక విషయంలోకి వస్తే...

ముగ్గురు పిల్లలను నర్మదా కాలువలో పడేసి.. ప్రియుడితో కలిసి మహిళ ఆత్మ‌హ‌త్య

వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టింది. చెవి నొప్పితో వెళ్లిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఇంజెక్షన్ వేశారు. అది కాస్తా వికటించింది. దీంతో ఆమె చేయి కోల్పోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన బీహార్లోని పాట్నాలో జరిగింది. శివహర్ జిల్లాకు చెందిన ఇరవై యేళ్ల రేఖ చెవి నొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రికి వెళ్ళింది. వైద్యులు జూలై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. వారు కొన్ని ఇంజక్షన్స్ రాశారు. వాటిని నర్సు రేఖ చేతికి వేసింది.  ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన రేఖకు ఎడమచేయి రంగు మారడమే కాకుండా నొప్పి కూడా మొదలైంది. 

దీంతో వెంటనే మళ్లీ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కొద్ది రోజుల తర్వాత అదే నయం అవుతుందని ప్రమాదమేమీ లేదని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడం వల్ల రేఖ అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. చివరకు పట్నాలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 4న శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఎడమ చేయి మోచేతి వరకు తొలగించారు. నవంబర్ లో వివాహం జరగాల్సి ఉండగా ఆమె చేయిని తొలగించడం వల్ల వరుడి కుటుంబసభ్యులు పెళ్లి రద్దు చేసుకున్నారు. 

click me!