సవతి కూతురిని పెట్టెలో పెట్టి లాక్ వేసి...!

Published : Nov 30, 2022, 10:11 AM IST
సవతి కూతురిని పెట్టెలో పెట్టి లాక్ వేసి...!

సారాంశం

తన కూతురు రాధికను తన సోదరుడికి దత్తత ఇచ్చాడు. అనంతరం.. సంవత్సరం క్రితం శిల్పి అనే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి.


తన సవతి కూతురి పట్ల ఓ మహిళ చాలా దారుణంగా ప్రవర్తించింది. 9ఏళ్ల చిన్న పిల్ల అనే జాలి కూడా లేకుండా ఆరు గంటలకు పైగా బాక్స్ లో పెట్టి లాక్ వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముజఫర్ నగర్ జిల్లా కృష్ణ పురి ప్రాంతానికి చెందిన సోను శర్మకు పెళ్లైంది. అతనికి 9ఏళ్ల కుమార్తె రాధిక ఉంది. కాగా... భార్యతో విబేధాలు రావడంతో.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తన కూతురు రాధికను తన సోదరుడికి దత్తత ఇచ్చాడు. అనంతరం.. సంవత్సరం క్రితం శిల్పి అనే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి.

కాగా... రాధిక ఆదివారం ఇంటి నుంచి దుకాణానికి వెళ్లి... తిరిగి ఇంటికి రాలేదు. దీంతో... రాధిక కనిపించడం లేదని... అతని తండ్రి కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దగ్గరలోని సీసీ కెమేరాలు చెక్ చేయగా.... బాలిక.. దుకాణం నుంచి ఇంటికి వైపుకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో...పోలీసులకు అనుమానం వచ్చి... వారి ఇంట్లోనే వెతికారు. దాదాపు గంటన్నర సేపు వెతికిన తర్వాత... బాలిక ఇంట్లోని ఓ పెట్టెలో కనిపించింది. పెట్టెలో స్పృహ కోల్పోయి ఉండటం గమనార్హం.

వెంటనే బాలికను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉంది. ప్రమాదం నుంచి బయటపడింది. మరి కాసేపు అందులోనే ఉంటే.... ప్రాణాలు కోల్పోయేదని వైద్యులు తెలిపారు. కాగా... తన సవతి తల్లే.. తనను బాక్స్ లో పెట్టిందని బాలిక చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu