ప్రియుడి మోజులో.. మైనర్ కూతుర్లను అమ్మేసిన కన్నతల్లి.. ఆ తరువాత పెళ్లి చేసుకుని...

By SumaBala BukkaFirst Published Sep 30, 2022, 11:47 AM IST
Highlights

కన్నకూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే దారుణానికి ఒడిగట్టింది. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి ముగ్గురు కూతుళ్లను అమ్మేసింది. అమ్మాయిలు పారిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఉజ్జయిని : ఉజ్జయినిలో ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 42 ఏళ్ల మహిళ, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి తన ముగ్గురు మైనర్ కూతుర్లను అమ్మేసింది. షాక్ కలిగించే ఈ ఘటనలో ఆ చిన్నారులు అక్కడినుంచి తప్పించుకుని తాతయ్య దగ్గరికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లి, ఆమె ప్రియుడితో పాటు చిన్నారులను కొన్న మరో ముగ్గురి మీద కేసు నమోదు చేసింది. చిన్నారులు పారిపోయిన విషయం తెలిసిన వెంటనే ఈ ఐదుగురు కనిపించకుండా పోయారు. 

16, 14 మరియు 12 సంవత్సరాల వయస్సు గల తన ముగ్గురు మైనర్ కుమార్తెలను.. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తి సాయంతో అమ్మేసింది ఓ మహిళ. ఈ భయానక ‘డీల్’ వివరాల్లోకి వెడితే.. రేవాలో ఈ జంట ఒకరికొకరు కలుసుకున్నారు. ఆ పరిచయం వారిని సహజీవనానికి పురిగొల్పింది. కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత అతను ఆమెను, ఆమె ముగ్గురు పిల్లలను ఉజ్జయినిలోని టిపుఖేడికి తరలించాడని పోలీసులు తెలిపారు. 

ఎన్ కౌంటర్ కు ముందు.. టెర్రరిస్టుకు వీడియోకాల్ చేసిన ఆర్మీ అధికారి.. అతనేమన్నాడంటే..

"మహిళ, ఆమె భాగస్వామి కలిసి ఎనిమిది నెలల క్రితం ఇద్దరు మైనర్ బాలికలను రాజస్థాన్ కు చెందిన ఇద్దరికి చెరో రూ. 4 లక్షలకు విక్రయించారు. ఇక చిన్న కూతురు మరీ చిన్నపిల్లకావడంతో ఆమెను రూ. 1.75 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయించారు. ఆ తరువాత అక్కడే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు" అని మహిద్‌పూర్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి ఆర్‌కె. రాయ్ అన్నారు.

కాగా, కొన్ని రోజుల క్రితం, బాలికలు తమను కొన్నవారి చెరనుంచి తప్పించుకుని, తమ తాతయ్యను కలుసుకున్నారు. తమను తల్లీ, ఆమె ప్రియుడు పెట్టిన కష్టాలు, అమ్మకం, తాము అక్కడ అనుభవించిన నరకాన్ని ఏకరువు పెట్టి తీవ్రంగా రోధించారు. దీంతో కదిలిపోయిన ఆ తాత బాలికలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాయ్ తెలిపారు. దీంతో లైవ్-ఇన్ భాగస్వామి, కొనుగోలుదారులపై IPC సెక్షన్ 370 (మానవ అక్రమ రవాణా), 376 (గ్యాంగ్‌రేప్) పోక్సో చట్టం కింద కేసు బుక్ చేయబడింది.

click me!