ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: రేసులో మల్లికార్జున ఖర్గే, తప్పుకోనున్న దిగ్విజయ్?

Published : Sep 30, 2022, 11:11 AM ISTUpdated : Sep 30, 2022, 11:48 AM IST
ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: రేసులో మల్లికార్జున ఖర్గే, తప్పుకోనున్న దిగ్విజయ్?

సారాంశం

ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మల్లిఖార్జున ఖర్గే పోటీ చేయనున్నారు. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ పోటీ నుండి తప్పుకొనే అవకాశం ఉందనే పరచారం సాగుతుంది.

న్యూఢిల్లీ: ఎఐసీసీ అధ్యక్ష పదవికి  మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారు.శుక్రవారం నాడు ఖర్గే నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. మరో వైపు ఈ పదవికి పోటీ నుండి  దిగ్విజయ్ సింగ్  తప్పుకొనే అవకాశం ఉంది.  ఎఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి రోజు.

దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు  ఈ పదవికి పోటీలో ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇవాళ  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో  పాటు మల్లికార్జున ఖర్గేతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ పదవికి పోటీ చేసే విషయంలో దిగ్విజయ్ పునరాలోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.  అంతకు ముందు శశిథరూర్ దిగ్విజయ్ తో భేటీ అయ్యారు.  గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా రేసులోకి రావడంతో దిగ్విజయ్ సింగ్ తప్పుకొంటారని ప్రచారం సాగుతుంది. గాంధీ కుటుంబం అనుమతితోనే తాను బరిలో ఉంటానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ఎఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని తొలుత ప్రచారం సాగింది. అయితే రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎఐసీసీ  అధ్యక్ష పదవి బరి నుండి గెహ్లట్ తప్పుకున్నారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్నప రిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు.

గెహ్లాటో సోనియాగాంధీతో సమావేశమైన రోజు సాయంత్రమే అదే రాష్ట్రానికి చెందిన సచిన్ పైలెట్ కూడా పార్టీ చీఫ్ సోనియాతో భేటీ అయ్యారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం పదవిలో గెహ్లాట్ ను కొనసాగిస్తారా లేదా అనే విషయమై త్వరలోనే తేలనుంది. ఎఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైతే రాజ్యసభలో విపక్ష నేత పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే పార్టీ నిబంధనావళికి కట్టుబడి ఖర్గే ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

also read:కౌన్ బనేగా రాజస్థాన్ సీఎం... సోనియాతో సచిన్ పైలట్ భేటీ, అధినేత్రి నిర్ణయంపై ఉత్కంఠ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకున్న దిగ్విజయ్ సింగ్ దేశంలోని పలు రాష్ట్రాల నేతలతో నిన్న చర్చలు జరిపారు. అయితే రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఖర్గే పోటీకి సిద్దమయ్యారు. దీంతో దిగ్విజయ్ సింగ్ పోటీలో కొనసాగుతారా లేదా అనేది ఇంకా స్పస్టత రాలేదు. దిగ్విజయ్ పోటీ నుండి వైదొలుగుతారనే ప్రచారం సాగుతుంది. 
 


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌